గణపతి ఎదుట అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు

Girls Obscene Dances In Front Of Lord Ganapathi

11:04 AM ON 7th September, 2016 By Mirchi Vilas

Girls Obscene Dances In Front Of Lord Ganapathi

భక్తిని , ఆధాత్మికతను పెంచడానికి దోహద పడే గణపతి నవరాత్రి ఉత్సవాలను పక్కదారి పట్టిస్తున్నారు కొందరు... సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కార్యక్రమాలు ఏర్పాటుచేస్తూ నవ్వులపాలు చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వినాయకచవితి సందర్భంగా అశ్లీల నృత్యాాలు చేశారు. వంగర మండలంలోని రాజులగుమ్మడలో వినాయక చవితి సందర్భంగా సోమవారం రాత్రి చేపట్టిన అశ్లీల నృత్య ప్రదర్శనను పోలీసులు నిలివేసి, ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

కొందరు యువకులు గ్రామ ప్రధాన రచ్చబండపై నృత్య ప్రదర్శనకు సిద్ధమవుతుండగా ఎస్ ఐ మధుసూధనరావుతో పాటు సిబ్బంది దాడి చేశారు. అశ్లీల ప్రదర్శన గోప్యంగా నిర్వహించాలన్న సమయంలో గ్రామస్థులతో పాటు కొంతమంది ఎస్పీతో పాటు, డీఎస్పీ కార్యాలయాలకు సమాచారం అందించారు. దీంతో ఎస్పీ ఆదేశాలతో రాజాం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు గ్రామానికి చెందిన పలువురి నిర్వాహకులను ఎస్ ఐ, సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వీరిని రిమాండ్ నిమిత్తం పాలకొండ తరలిం చారు.

ఇది కూడా చూడండి: సంగీత ప్రియులు మనసు దోచే విభిన్న సంగీత వాయిద్యాలు!

ఇది కూడా చూడండి: ఆడవాళ్ళకు ఎక్కువగా వచ్చే కల ఏమిటో తెలుసా?

ఇది కూడా చూడండి: దెయ్యాలు నివాసముండే ఫేమస్ సిటీస్ ఇవే!

English summary

Girls obscene dances in front of lord Ganapathi at Srikakulam district. Five people arrested by police.