కాలేజీ లేడీస్ హాస్టల్ లో ఆ దృశ్యాల రికార్డింగ్ తో కలకలం

Girls videos were recorded in ladies hostel

11:18 AM ON 4th November, 2016 By Mirchi Vilas

Girls videos were recorded in ladies hostel

మహిళల కోసం ఎన్ని చట్టాలున్నా సరే ఏదో రూపంలో లైంగిక దాడులు, అరాచకాలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో వున్న కేజేఆర్ ఫార్మసీ కళాశాల హాస్టల్ లో సిసి కెమెరాలో రికార్డయైన దృశ్యాలపట్ల విద్యార్థినులు బుధవారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... కళాశాల వసతి గృహంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి అదే వసతి గృహంలో ఉన్న సీసీ కెమెరాలోని కొన్ని రికార్డు అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకుని విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ధర్నాకు దిగారు.

దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులు, కళాశాల యాజమాన్యంతోనూ చర్చించారు. శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.

English summary

Girls videos were recorded in ladies hostel