ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తున్న మాక్స్ వెల్ అద్భుత విన్యాసం(వీడియో)

Glenn Maxwell's incredible catch

12:36 PM ON 12th October, 2016 By Mirchi Vilas

Glenn Maxwell's incredible catch

నిజం, ఓ క్రికెటర్ వీడియో ఇంటర్నెట్ ను కుదిపేస్తోంది. అతను చేసిన ఫీట్ నెట్ లో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది. ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ బౌండరీ లైన్ దాటి జంప్ చేసి క్యాచ్ అందుకున్న తీరు అద్భుతంగా ఉంది. ఆ సమయంలో కింద పడే క్రమంలో అత్యల్ప సమయంలోనే దాన్ని మైదానం లోపలికి విసిరాడు. అక్కడే ఉన్న మరో ఆటగాడు రాబ్ క్వినీ దాన్ని సమయస్ఫూర్తితో అందుకున్నాడు. మటడోర్ కప్ లో భాగంగా పెర్త్ లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా, విక్టోరియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ అద్భుతం జరిగింది. విక్టోరియా జట్టు తరుపున ఆడుతున్న మాక్స్ వెల్ 87 పరుగుల వద్దనున్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఓపెనర్ మైకేల్ క్లింగర్ కొట్టిన సిక్స్ ను ఔట్ గా మలిచాడు.

ఈ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం వెస్ట్రన్ ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ క్యాచ్ దృశ్యంపై మీరూ ఓ లుక్కెయ్యండి.

English summary

Glenn Maxwell's incredible catch