ఎత్తు పెరగడానికి ఆపరేషన్ చేస్తే, వికటించింది

Global hospital promises to make him 3 inches taller for 7 lakhs

11:52 AM ON 6th April, 2016 By Mirchi Vilas

Global hospital promises to make him 3 inches taller for 7 lakhs

వైద్య శాస్త్రంలో వస్తున్న విప్లవాత్మక మార్పులలో భాగంగా ఇప్పుడు మనిషి ఎత్తు పెరగాడానికి కూడా ఆపరేషన్ చేస్తున్నారట. అసలు ఈ ఆపరేషన్ ఎలా చేస్తారు..? హైట్ ఆపరేషన్ గురించి తెలుసుకోవాలంటే, వివరాల్లోకి వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడ ఇంట్లో వాళ్లకు తెలీకుండా ఆపరేషన్ అవ్వడం కొంత వివాదం అయింది. హైదరాబాద్ లో నిఖిల్ రెడ్డి తన ఎత్తు పెరిగేందుకు గ్లోబల్ ఆస్పత్రి ని సంప్రదించడం, వాళ్ళు అతని పేరెంట్స్ కు తెలియజేయకుండానే అతనికి ఆపరేషన్ చేయడం పెద్ద వివాదాన్నే సృష్టించింది. ఎత్తు పెరిగేందుకు చేసే శస్త్ర చికిత్సలో మోకాలి కింది భాగంలో ఎముకను కట్ చేసి అక్కడ స్క్రూలను బిగించి జాక్ సిస్టం ను అమర్చుతారట.

ఇది కూడా చదవండి: జడేజా కి పెళ్లి కి ముందే ఆడీ కారు గిఫ్ట్

కొన్ని రోజుల తర్వాత తిరిగి స్క్రూలను బిగిస్తూ ఎముకల మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గిస్తారట.. మళ్ళీ బోన్స్, కండరాలు పెరిగేవరకూ ఇదే పద్ధతిలో ఇంకొంచెం పెరిగేలా చేస్తారని అంటున్నారు. అయితే ఈ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి సుమారు మూడు నెలల పాటు వీల్ చైర్ లోనే ఉండాల్సి ఉంటుంది. పూర్తిగా కోలుకుని నడిచేందుకు ఆరు నెలలు పడుతుంది. విదేశాల్లో మాత్రమే అరుదుగా జరిగే ఇలాంటి ఆపరేషన్ ను గతంలో గ్లోబల్ ఆస్పత్రి డాక్టర్లు నిర్వహించగా అది సక్సెస్ కాలేదని తెలిసింది. అటు కోర్టు ఆదేశాల ప్రకారం ఈ విధమైన శస్త్ర చికిత్సను నిర్వహించే ముందు సంబంధిత వ్యక్తికి డాక్టర్లు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిఖిల్ రెడ్డి తండ్రి గోవర్ధన్ రెడ్డి అంటున్నారు.

ఇది కూడా చదవండి: ప్రత్యూష కేసులో రాహుల్ పై కేసు

కానీ ఇలా తన కొడుకుకు కౌన్సెలింగ్ ఇవ్వలేదని ఆయన ఆరోపిస్తున్నాడు. ఆసుపత్రి యాజమాన్యం డబ్బు కోసమే పాకులాడిందని ఆయన ద్వజమెత్తుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త

English summary

Global hospital promises to make him 3 inches taller for 7 lakhs. But the operation was failed.