రూపుమారనున్న జీమెయిల్ ఇన్ బాక్స్

Gmail Inbox New Feature

04:32 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Gmail Inbox New Feature

మనం విరివిగా వాడే జీమెయిల్ కాస్త రూపు మార్చుకోనుంది. ఇక పై మీ జీ మెయిల్ ఇన్ బాక్స్ పూర్తిగా మారిపోనుంది. అది కాస్తా ఇన్‌బాక్స్ బై జీమెయిల్‌గా మారనుంది. ఇప్పుడు జీమెయిల్ వాడుతున్న యూజర్లకు నోటిఫికేషన్ రూపంలో వచ్చిన మెయిల్‌ను యాక్సెప్ట్ చేస్తే మీ జీమెయిల్ కాస్త ఆటోమెటిక్‌గా ఇన్‌బాక్స్ జీమెయిల్‌గా మారుతుంది. దీనివల్ల మీ పాత అకౌంట్లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. దీనికి దానికి లింక్ చేస్తున్నారు అంతే. ఇది 2014లోనే లాంచ్ అయిన సర్వీస్. అయితే ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త ఫీచర్లతో ఫ్లైట్ బుకింగ్, ప్యాకేజీ డెలివరీస్ వంటి ఎన్నో అడ్వాన్స్ ఫీచర్లను వాడుకోవచ్చని గూగుల్ టీమ్ చెపుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ జీమెయిల్ కొత్త ఫీచర్లను మీరు కూడా ఓసారి ట్రై చేసేయండి.

English summary

Gmail introduced a new feature. Gmail inbox have changed to inbox by gmail