ప్రయోగం వికటించడంతో జీమెయిల్‌ క్షమాపణ

Gmail Says Sorry To Users For April Fools Day Prank

01:21 PM ON 2nd April, 2016 By Mirchi Vilas

Gmail Says Sorry To Users  For April Fools Day Prank

అన్ని వేళలా మనది కాదనే సామెత ఉత్తినే ఉందా ? అందుకే ప్రతిసారి ఏదో ఓ ప్రయోగం చేసే జీ మెయిల్ ఇప్పుడు బోల్తా కొట్టింది. దీంతో వినియోగదారులకు క్షమాపణ చెప్పింది. వివరాల్లోకి వెళ్తే , సాధారణంగా ప్రతి ఏప్రిల్ 1వ తేదీనా ఏదో ఒక ప్రాంక్ (చేష్ట)తో సందడి చేసే గూగుల్ శుక్రవారం ఆ ప్రయత్నం చేసింది. జీమెయిల్ లో సెండ్ బటన్ పక్కనే సెండ్ +మైక్ డ్రాప్ అనే బటన్ ను ఏర్పాటు చేసింది. సాధారణంగా మనం ఎవరితోనైనా వాదిస్తున్నప్పుడు మన మాటే చివరిది కావాలనుకుంటే.. మధ్యలో వాదనవదిలేసి వెళ్లిపోతాం(మైక్ డ్రాపింగ్ ). అవతలి వ్యక్తులు చెప్పేది వినిపించుకోం. ఏప్రిల్ 1నాడు వినియోగదారులు కూడా సెండ్ +మైక్ డ్రాప్ బటన్ ద్వారా తమకు నచ్చనివారితో ఇలాగే చేయొచ్చన్నది గూగుల్ ఉద్దేశం.

ఇవి కుడా చదవండి:భారత్ ఓడిపోయిందోచ్ ట్విట్టర్లో రెచ్చిపోయిన బంగ్లా క్రికెటర్

అయితే, ఆ బటన్ ను సెండ్ బటన్ పక్కనే పెట్టడం సమస్యలకు కారణమైంది.ఎవరైనా మెయిల్ పంపేటప్పుడు సెండ్ కు బదులు ఈ బటన్ నొక్కితే.. వారి మెయిల్ చివర మైక్ డ్రాపింగ్ మెమో జిఫ్ యానిమేషన్ బొమ్మ ఒకటి తోడయి అవతలి వ్యక్తికి చేరుతుంది. దీంతో అవతలి వ్యక్తి నుంచి వచ్చే ఏ మెసేజ్ మనకు కనిపించదు. యథాలాపంగా ఈ బటన్ నొక్కడం వల్ల ఉద్యోగం కోల్పోయానని గూగుల్ ఫోరమ్ లో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇలాగే పలువురు వినియోగదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో గూగుల్ సంస్థ ఆ బటన్ ను ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పింది. ‘ఈసారి (ఏప్రిల్ 1కి) మమ్మల్ని మేమే ఫూల్స్ ని చేసుకున్నట్టయింది’ అని గూగుల్ వ్యాఖ్యానించింది.

ఇవి కుడా చదవండి:

ఉత్తర కొరియాలో ఫేస్ బుక్ , ట్విట్టర్ లపై బ్యాన్

కన్నవాళ్లే కాటు వేస్తున్న అత్యాచారాల దేశం ఇదే

English summary

Google apologizes after April Fools’ Day ‘Minions’ prank misfires, allegedly costs some Gmail users jobs.