బాలికపై అత్యాచారం చేసిన ఎమ్మెల్యే

Goa MLA Raped Minor Girl

04:06 PM ON 6th May, 2016 By Mirchi Vilas

Goa MLA Raped Minor Girl

ఒక ప్రజా ప్రతినిధిగా తన నియోజకవర్గంలోని ప్రజల అవసరాలను తీర్చాల్సిన ఒక ఎమ్మెల్యే నీచానికి ఒడిగట్టాడు . కూతురు వయసుండే ఒక బాలిక పై ఆ ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక వివరాల్లోకి వెళ్తే..గోవాలో గత మార్చి నెలలో ఓ మైనర్ బాలిక ఉన్నట్టుండి అదృశ్యమైంది. ఆమె కోసం గాలించిన పోలీసులకు ఇటీవలే ఆమె ఆచూకి లభించింది . ఆ బాలికను పోలీసులు మహిళా సంరక్షణా కేంద్రంలో ఉంచి విచారించడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. స్థానిక సెయింట్ క్రూజ్ కు చెందిన బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే "అటానాసియో మోన్సిరేట్" తన పై అత్యాచారానికి పాల్పడినట్టు ఆ బాలిక పోలీసులకు తెలిపింది .

ఇవి కూడా చదవండి:అల్లు అర్జున్ ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా?

ఆ మైనర్ బాలిక చెప్పిన వివరాల ప్రకారం పనాజి పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యే తాను ఎలాంటి విచారణకైనా సిద్దమని , తాను విచరణకు హాజరవుతానని, ఎక్కడికి పారిపోనని పోలీసులకు తెలిపాడు . ఈ ఘటన పై స్పందించిన ఆ ఎమ్మెల్యే ఇదంతా తన పై జరిగిన కుట్ర అని , ఎవరో కావాలనే తనను ఇరకాటంలో పెట్టె ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. ఆ మైనర్ బాలిక తన షోరూమ్ లో పనిచేసేదని, డబ్బులు విషయంలో అవకతవకలు జరగడంతో ఆమెను విధుల నుండి తొలగించానని చెప్పాడు. ఆ కక్షతోనే తన పై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు పోలీసులకు వివరించాడు. ఎనిమిదేళ్ల క్రితం మోన్సిరేట్ ఈ ఎమ్మెల్యే గారి పుత్రా రత్నం కూడా పర్యటనకు వచ్చిన జర్మన్ బాలికపై అత్యాచారం చేశాడు.

ఇవి కూడా చదవండి:వెరైటీగా ఆత్మహత్య చేసుకున్న యువతి!

ఇవి కూడా చదవండి:24 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కూడా చదవండి:ఈ పార్క్ కి న్యూడ్‌గానే వెళ్ళాలట

English summary

Goa MLA named Atanasio Monserratte was arrested by the police for raping Minor Girl. He was raped a girl who was working in his Showroom. Polcie filed case against him and put him in Jail.