ఫేస్ బుక్ కి గోల్డ్ మెడల్ - ట్విట్టర్ కి సిల్వర్ మెడల్

Gold And SIlver Medals For Facebook And Twitter

12:07 PM ON 24th August, 2016 By Mirchi Vilas

Gold And SIlver Medals For Facebook And Twitter

అవునా, అంటే అవుననే అంటున్నారు. రియో ఒలింపిక్స్ లో సోషల్ మీడియా ఫేస్ బుక్ బంగారు పతకం, ట్విట్టర్ రజత పతకం సాధించాయి. ఎలా అని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్ళాలి. రియో ఒలింపిక్స్ 2016 పోటీలు జరుగుతున్నప్పుడు ఫేస్ బుక్ లో 227మిలియన్ల మంది తమ పోస్టుల ద్వారా సుమారు 1.5బిలియన్ల మాటలు జరిపారట. అలాగే ట్విట్టర్ వేదికగా 187 మిలియన్ల ట్వీట్ల ద్వారా 75బిలియన్ వ్యూస్ లభించాయట. అందుకే రియో ఒలింపిక్స్ లో సోషల్ మీడియాకి పతకాలు లభించాయన్నమాట. అలా ఫేస్ బుక్ కి బంగారు పతకం, ట్విట్టర్ కి రజత పతకం లభించాయి. ఈ రెండు సోషల్ మీడియాలు సోమవారం ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి ఈ వివరాలు అందించాయి. మైకెల్ ఫెల్ప్స్ , ఉసేన్ బోల్ట్ తో పాటు అథ్లెట్లకు సంబంధించే ఎక్కువ మంది సంభాషణలు జరిపినట్లు తెలిపాయి.

ఫేస్ బుక్ లో మొదటి మూడు స్థానాల్లో స్విమ్మింగ్ , జిమ్నాస్టిక్స్ , ట్రాక్ అండ్ ఫీల్డ్ ఆటగాళ్ల గురించి ఎక్కువ మంది సంభాషించుకోగా ట్విట్టర్ లో స్విమ్మింగ్ , సాకర్ , ట్రాక్ అండ్ ఫీల్డ్ గురించి ఎక్కువ మంది ట్వీట్ చేశారు.

అమెరికా క్రీడాకారిణి బైల్స్ , నటుడు జాక్ ఎఫ్రాన్ కలిసి ఉన్న ఓ వీడియోను ట్విట్టర్ లో ఉంచగా రికార్డు స్థాయిలో 1,63,000 రీట్వీట్లు రాగా సుమారు 4,59,000 లైక్ లు వచ్చాయి.

జమైకన్ స్ప్రింటర్ బోల్ట్ ను అభినందిస్తూ ఫేస్ బుక్ లో పోర్చుగీస్ సాకర్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో చేసిన పోస్టు ఎక్కువ మంది షేర్ చేసిన పోస్టుగా మొదటి స్థానంలో నిలిచింది.

భారత్ కు రజత పతకాన్ని అందించిన పీవీ సింధును అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పోస్టును ఫేస్ బుక్ లో ఎక్కువ మంది షేర్ చేశారంట. భలే వుంది కదూ.

ఇవి కూడా చదవండి:క్రికెటర్లపై ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం మెక్ గ్రాత్ షాకింగ్ కామెంట్స్

ఇవి కూడా చదవండి:సంపన్న దేశాల్లో భారత్ సెవెంత్ ప్లేస్

English summary

Rio Olympics have been grandly completed in Rio and now according to a survey found that there have been 227 million posts in Facebook on Rio Olympics and 187 million Tweets on Rion Olympics in Twitter.