వారెవ్వా ... డైపర్లలో బంగారు కడ్డీలు... వాటి విలువ ఎంతో తెలిస్తే మతిపోద్ది

Gold Biscuits Found In Diapers At Airport

11:19 AM ON 13th December, 2016 By Mirchi Vilas

Gold Biscuits Found In Diapers At  Airport

ఏదైనా ఓ పని తలపెడితే దానికి తూట్లు పొడవడానికి అన్ని రకాల యత్నాలు రెడీ గా ఉంటాయి. అలాంటి అఖండులు వున్నారు మరి. లేకపోతె, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశంలో నల్లధనం వెలికివస్తుండటం ఒకవైపు విస్మయకరంగా ఉంటే మరోవైపు విదేశాల నుంచి వచ్చే వారి స్మగ్లింగ్ కార్యకలాపాలు సైతం అదే రీతిలో సాగుతున్నాయి. తాజాగా పిల్లలు వాడే డైపర్లలో 16 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న విమానంలో ఉన్న ఆరుగురు మహిళల వద్దనున్న వస్తువులను తనిఖీ చేయగా... వారి వద్దనున్న డైపర్లలో సుమారు 16 కేజీల బంగారం పట్టుబడినట్లు అధికారులు వివరించారు.

ఈ ఆరుగురిలో ఇద్దరు దంపతులు ఓ చిన్నారి ఉన్నట్లు తెలిపిన అధికారులు సదరు ప్రయాణికులను సూరత్ కు చెందిన వారిగా గుర్తించారు. విమానం దిగి బయటకు వస్తున్న సమయంలో వీరి అనుమానాస్పద ప్రవర్తన చూసి, మరోసారి తనిఖీలు చేసారు. ఒక్కోటి కేజీ చొప్పున ఉన్న 16 బంగారు కడ్డీలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ బంగారాన్నిసీజ్ చేసి కేసు నమోదు చేసుకున్నామని తదుపరి దర్యాప్తు అనంతరం నిర్ణయం ఉంటుందని వారు వివరించారు.

ఇది కూడా చూడండి: గడ్డం బాగా పెరగాలన్నా, అందంగా ఉండాలన్నా ఇలా చెయ్యండి..

ఇది కూడా చూడండి: బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఇప్పటివరకు ఎన్ని నిజమయ్యాయో మీరే చూడండి

ఇది కూడా చూడండి: పేరులోని మొదటి అక్షరం తో మీరెలాంటివారో తెలుసుకోవచ్చిలా

English summary

Sixteen kgs Gold Biscuits Found In Diapers At Delhi Airport