దుబాయ్‌ ప్రదర్శనలో రూ.6.6 కోట్ల బంగారు కారు

Gold Car Worth One Million Dollars in Dubai car exhibition

12:14 PM ON 11th May, 2016 By Mirchi Vilas

Gold Car Worth One Million Dollars in Dubai car exhibition

అతి భారీ ఎత్తులో భవనాలు, ఖరీదైన జీవనశైలి వంటి వాటికి పెట్టింది పేరు గా నిలిచిన దుబాయ్‌ పర్యాటకులకు స్వర్గధామం...ఇక ప్రస్తుతం ఈ నగరంలో జరుగుతున్న వాహన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంటోంది. 2016 ఆటోమెకానికా దుబాయ్‌ (దుబాయ్‌ వాహన ప్రదర్శన)లో కొలువుతీరిన నిస్సాన్‌ ఆర్‌35 జీటీ-ఆర్‌ మోడల్‌ కారు ఇది. వీక్షకులను కట్టి పడేస్తోంది. ఏంటీ దీని ప్రత్యేకత అని అనుకుంటున్నారా? సాధారణ కార్లకు భిన్నంగా దీన్ని బంగారు పూతతో రూపొందించడమే. కుల్‌ రేసింగ్‌ సంస్థ ప్రదర్శించిన ఈ కారుకు ‘గాడ్జిల్లా’ అని నామకరణం చేశారు. దీని విలువ 1 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.6.6 కోట్లు) కావడం విశేషం. ఆర్టిస్‌, కుల్‌ రేసింగ్‌లతో పాటు కార్ల నిపుణుడు తకాహికో ఇజావాలు దీన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 3.8 లీటర్‌ వీ6 ట్విన్‌ టర్బో 545 హెచ్‌పీ ఇంజిన్‌, అదనపు హార్స్‌పవర్‌, టార్క్‌లతో గాడ్జిల్లాను తయారు చేశారు. ఏరో డైనమిక్‌ ఫీచర్లు, బలమైన నిర్మాణాలు నిస్సాన్‌ ఆర్‌35 జీటీ-ఆర్‌ ప్రత్యేకతలు. 6-స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌ సహాయంతో చోదకులు రేస్‌ కారు స్పీడ్‌ను అందుకోవచ్చు. సరి, బేసి సంఖ్యల గేర్లకు వేర్వేరు వెట్‌ క్లచ్‌లను ఏర్పాటు చేశారు. ఖరీదైన కారు జోరు అందుకునేదెవరొ!

ఇవి కుడా చదవండి:శృంగారానికి బానిసైన శ్రీనివాస్‌

ఇవి కుడా చదవండి:అది చేస్తూ దొరికేసిన ఎయిర్ హోస్టెస్

ఇవి కుడా చదవండి:హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య

English summary

Dubai was known for its rich life style and tall buildings and so many other attractions. Recently a Car which was Made of Gold was show cased in Dubai Cars Exhibition and the worth of this Golad car war 1 Million(6.6 crores).