సీతమ్మ పుస్తెలతాడు గల్లంతు

Gold chains stolen from bhadrachalam temple

11:55 AM ON 22nd August, 2016 By Mirchi Vilas

Gold chains stolen from bhadrachalam temple

అమ్మవారికే ఎసరు పెట్టె దుర్మార్గులు పుట్టుకొచ్చారు. లేకపోతే సీతమ్మ అమ్మవారి నగలు మాయంకావడమా? రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన భద్రాద్రి ఆలయంలో సీతమ్మవారి పుస్తెలతాడు సహా రెండు ఆభరణాలు గల్లంతవడం కలకలం రేపుతోంది. వివారాల్లోకి వెళ్తే, వాస్తవానికి ఆలయంలోని బంగారు నగ లు మాయమయ్యాయంటూ మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాగా ప్రతిరోజు నిత్యకల్యాణం సందర్భంగా వినియోగించే సీతమ్మవారి మంగళసూత్రం, లక్ష్మణస్వామికి కల్యాణ సమయంలో సమర్పించే ఆభరణ సమర్పణ పతకం (బంగారం లాకెట్ ) కనిపించడం లేదనే విషయాన్ని ఈవో రమేశ్ బాబు ఆదివారం ధ్రువీకరించారు. మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో పూర్తి వివరాలతో నివేదికను ఇవ్వాలని ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధచార్యులు, సీతారామానుజాచార్యులను ఆదేశించారు. దీంతో వారు తమ ఆర్చక సిబ్బందితో ఈవో ప్రత్యేక అనుమతితో ఆలయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేసి, ఆభరణాలను లెక్కలు సరిచూసుకున్నారు. మూడు గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది.

కాగా శ్రీసీతారామచంద్రస్వామి దేవస్ధానంలో మొత్తం 25 మంది అర్చకులు వివిద హోదాల్లో పనిచేస్తున్నారు. వీరిలో నిత్యం స్వామి వారి పూజా కార్యక్రమాలైన నిత్య కల్యాణాలు, దర్బారు ఇతర సేవల్లో పాల్గొనే వారితో ఈవో ఆదివారం మధ్యాహ్నం అంతర్గతంగా కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధాన, ఉపప్రదాన, ముఖ్య అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆభరణాల మాయంపై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై వివరణ ఇవ్వాలని ఈవో వారిని ఆదేశించారు. తాము రెండు గంటలపాటు ఆభరణాలను సరిచూసుకున్నామని, రెండు ఆభరణాల లెక్క తేలలేదని ఈవోతో అర్చకులు పేర్కొనట్లు సమాచారం. అవి మరెక్కడైనా భద్ర పరచడం జరిగిందా? , పట్టు వసా్త్రలలో ఉన్నాయా?.. నవమి, మక్కోటికి వినియోగించే ఆభరణాల్లో కలిశాయా? అనే కోణంలో మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందని, ఇందుకోసం సోమవారం సాయంత్రం వరకు గడువు ఇవ్వాలని వారు కోరారు.

ఉండాల్సిన చోటలేవట...

రామాలయంలోని నిత్యకల్యాణ బంగారు ఆభరణాలను భద్రపరిచే బీరువాలో రెండు ఆభరణాలు లేనిమాట వాస్తవమేనని భద్రాచల దేవస్థానం ఈవో టి.రమేశ్ బాబు తెలిపారు. నిత్య కల్యాణానికి వినియోగించే సీతమ్మవారి మంగళ సూత్రం, లక్ష్మణస్వామికి సమర్పించే ఆభరణ సమర్పణ పతకం కనబడటం లేదని అర్చకులు తెలిపినట్లు చెప్పారు. వారు సోమవారం సాయంత్రం వరకు గడువు కోరారని, అనంతరం తాను పూర్తిస్థాయిలో ఆభరణాలను తనీఖీ చేసి వివరాలను వెల్లడిస్తానన్నారు.

ఇది కూడా చూడండి: ఇకపై ఆ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే 3 ఏళ్ళు జైలు.. 3 లక్షల జరిమానా!

ఇది కూడా చూడండి: గ్రామస్థుల మధ్య కొట్లాటకు దారితీసిన సీరియల్!

ఇది కూడా చూడండి: బెంబేలెత్తుతున్న టర్కీ.. మ్యారేజ్ వేడుకలో 30 మందిని చంపేశారు

English summary

Robbery in Seetha Ramachandra Swamy temple In Bhadrachalam. The Gold chains worth Rs 2.5 lakh.