గోమూత్రంలో బంగారం.. ఇదో సంచలనం!

Gold in cow urine

11:59 AM ON 28th June, 2016 By Mirchi Vilas

Gold in cow urine

గోమాతను చాలామంది దైవంగా భావిస్తూ.. గోవును తాకితేనే పాపాలు హరించిపోతాయని భావిస్తారు. అయితే గోమూత్రంలో బంగారం దాగుందనే సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గిర్ జాతి ఆవుల మూత్రంపై గుజరాత్ లోని జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నిర్వహించిన తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడయింది. 400 గిర్ ఆవుల నుంచి సేకరించిన మూత్రం నమూనాలను జేఏయూలోని ఆహార పరీక్ష ల్యాబ్ లో పరీక్షించగా లీటర్ మూత్రంలో మూడు నుంచి 10 మిల్లీ గ్రాముల బంగారం ఉన్నట్టు బయటపడింది. అయాన్ల రూపంలో బంగారం ఉన్నట్టు పరిశోధనకారులు వెల్లడించారు.

గోమూత్రంలో బంగారం ఉంటుందని పూర్వీకులు చెప్పగా వినడమే తప్ప ఇంతవరకు శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదని.. ఈ విషయాన్ని తేల్చేందుకే తామీ పరిశోధన చేపట్టినట్టు గొలాకియా తెలిపారు. 400 గిర్ ఆవుల నుంచి సేకరించిన మూత్రం శాంపిల్స్ లో బంగారం ఉన్నట్టు తాము కనుగొన్నామని.. ఒంటెలు, గేదెలు, గొర్రెలు, మేకల నుంచి సేకరించిన మూత్రంపైనా పరిశోధనలు చేయగా అందులో యాంటీ బయోటిక్ పదార్థాలు కనిపించలేదని.. గోమూత్రంలో బంగారంతో పాటు పలు ఔషధ గుణాలను కూడా తాము కనుగొన్నట్టు గొలాకియా తెలియజేసారు.

English summary

Gold in cow urine