అతడి తల వెంట్రుకల్లో నిజంగా బంగారమే

Gold in his Hair and body

11:58 AM ON 2nd February, 2017 By Mirchi Vilas

Gold in his Hair and body

ఓర్నీ బంగారం గానూ అనడం వింటుంటాం. కానీ కొందరు నీ మనుసు బంగారం అని సంభోదిస్తుంటాం. అయితే, 15వ శతాబ్దానికి చెందిన ఖగోళశాస్త్రవేత్త టైకో బ్రహే మనసుతో పాటు అతడి శరీరం కూడా బంగారం మయం అయిందట. అవును . నిజంగానే అతడి శరీరంలో బంగారం దొరికింది. అతడి వెంట్రుకలు, ఎముకల్లో బంగారం లభించింది. యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ డెన్ మార్క్ అసోషియేట్ ప్రొఫెసర్ కారే లూండ్ రస్మూస్సెన్ బ్రహే మ ృతదేహాన్ని పరీక్షించారు. ‘‘బ్రహే వెంట్రుకల్లో 20 నుంచి వంద రెట్లు బంగారం కనుగొన్నాం. బహ్రే జీవన శైలి వల్లే అతడి ఒంట్లో బంగారం చేరి ఉంటుంది. అతడు బంగారు పాత్రల్లోనే ఆహారం తీసుకొనేవాడు. మద్యంలో బంగారు రేకు కలుపుకొని తాగేవాడు. బంగారంతో చేసిన ఔషధాలు వాడేవాడు. రసవాదంతో కూడా పరిచయం ఉండంతో బంగారంతో వివిధ ప్రయోగాలు చేసేవాడు. అందువల్లే బహ్రే శరీరంలోకి బంగారం చేరి ఉంటుంది’’ అని ప్రొఫెసర్ కారే లూండ్ తెలిపారు. బహ్రే శరీరంలో వెండి కూడా లభించింది. అతడు పాదరసం వికటించి చనిపోయాడని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ వార్త నెట్ లో హల్ చల్ చేయడంతో కామెంట్స్ తో నెటిజన్లు అదర గొడుతున్నారు.

ఇది కూడా చూడండి: హిట్లర్ రహస్య స్థావరం ఎక్కడో తెలుసా

ఇది కూడా చూడండి: ఇక నుంచి అంత్యక్రియలు కూడా లైవ్ లో చూడొచ్చు

English summary

there was a gold in Tyco Brahme's hai and body because he wear and eat in gold.