వరల్డ్ కప్ లో భారత్ షూటర్ కి స్వర్ణం

Gold medal for Indian shooter in worldcup

04:29 PM ON 19th September, 2016 By Mirchi Vilas

Gold medal for Indian shooter in worldcup

ఒలంపిక్స్ తర్వాత మరో స్వర్ణం భారత్ ను వరించింది. హై జంప్ లో తమిళనాడుకి చెందిన మరియప్పన్ స్వర్ణం గెలుచుకోగా, ఇప్పుడు ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ లో భారత యువ షూటర్ శుభాంకర్ ప్రమాణిక్ స్వర్ణ పతకం సాధించాడు. 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో 205.5 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. మొదటిగా అర్హత రౌండ్ లో ఆరో స్థానం సాధించి ఫైనల్ కు అర్హత సాధించాడు. తొలి ఎనిమిది మంది ఫైనల్ కు చేరగా, తుది పోరులో శుభాంకర్ ఉత్తమ ప్రదర్శన ఇచ్చాడు. దీంతో టాప్ లో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. చెక్ రిపబ్లిక్ క్రీడాకారుడు ఫిలిప్ 205.2, రొమేనియా షూటర్ డ్రగోమిర్ 185.1 పాయింట్లతో వరుసగా సిల్వర్, బ్రాంజ్ మెడల్ సాధించారు. దీంతో పలువురు ప్రముఖులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: రాజమౌళికి షాక్: 'బాహుబలి 2' కి కూడా ఈ గండం తప్పలేదు.. స్టోరీ మొత్తం లీక్ చేసేశారు!

ఇది కూడా చదవండి: ప్రియుడు ఆచూకీ తెలుసుకోవడం కోసం ఆ అమ్మాయి రోడ్డుపై బట్టలు విప్పేసి..(వీడియో)

ఇది కూడా చదవండి: తన తల్లిని చంపిన హంతకుడ్ని పట్టించిన ఐదేళ్ల చిన్నారి.. ఇందులో ట్విస్ట్ వింటే దిమ్మతిరుగుద్ది!

English summary

Gold medal for Indian shooter in worldcup