సమ్మె బాట పట్టనున్నబంగారు వర్తకులు

Gold Merchants Strike For Increasing Excise duty tax

05:48 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Gold Merchants Strike For Increasing Excise duty tax

బంగారు వ్యాపారులు దేశవ్యాప్తంగా సమ్మె బాట పట్టబోతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నిన్న పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నేపధ్యంలో బడ్జెట్‌లో బంగారు ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించడం పట్ల జ్యువెలరీ ట్రేడ్‌ ఫెడరేషన్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీంతో తమ నిరసన తెలుపుతూ సమ్మె చేపట్టే అంశంపై వారు బంగారు వర్తకులతో విస్తృత చర్చలు జరుపుతున్నారు.

ఇక కేరళ రాష్ట్రంలో బంగారు వ్యాపారులు మంగళవారమే సమ్మెకు దిగిపోయారు. ఇప్పటికే రూ.2లక్షలకు పైగా విలువ చేసే బంగారం కొనుగోలు చేయాలంటే కచ్చితంగా పాన్‌కార్డు ఉండాలన్న నిబంధన ఉంది. దీంతోనే ఇబ్బంది పడుతున్న సమయంలో ఎక్సైజ్‌ సుంకాన్ని కూడా పెంచడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కేంద్రం మళ్ళీ బడ్జెట్ లో ఏమైనా సవరణ చేస్తుందేమో చూడాలి.

English summary

Gold Merchants from All Over India was going to do Strike For Increasing Excise duty tax.Yesterday Indian Finance Minister Arun Jaitley Had Announced Budget For the year 2016-2017.