బంగారం ధరకు రెక్కలు

Gold Price Go High

06:31 PM ON 9th February, 2016 By Mirchi Vilas

Gold Price Go High

మాఘ మాసం వచ్చేసింది .... ఇన్నాళ్ళూ శూన్య మాసంతో మార్కెట్ పడిపోయింది. ఇప్పుడు మాఘమాసం వేళ పెళ్లిళ్ల సీజన్‌ రావడమో అందరూ బంగారం కొనుగోళ్ళు మీద పడతారు. వివాహాలు కూడా ఎక్కువే వున్నాయి. దీనికి తోడు గ్లోబల్‌ మార్కెట్ల ప్రభావంతో పసిడి ధర బాగా పెరిగింది . మంగళవారం 28వేల మార్క్‌ దాటి, ఈ ఏడాది గరిష్ఠానికి చేరి పోయింది. ఏకంగా ఒకేసారి రూ. 710 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ. 28,585కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,195.66 డాలర్లుగా ఉందని అంటున్నారు. ఇక బంగారం దారిలోనే వెండి ధర కూడా పెరుగుతోంది. మంగళవారం వెండి కేజీకి రూ. 1,180 పెరిగి, రూ. 37,230కు చేరిపోయింది. నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

English summary

Once again gold price go high.Gold Price hits Rupees 28,585 for 10 grams of gold.Silver rate was also goes high along with Gold Price