గోల్డ్ మేన్ ని దారుణంగా చంపేశారు

Gold shirt man dattatreya murdered in Pune

06:21 PM ON 15th July, 2016 By Mirchi Vilas

Gold shirt man dattatreya murdered in Pune

ఒంటిపై బంగారు షర్ట్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన పూణేకు చెందిన 44 ఏళ్ల గోల్డ్ మెన్ దత్తాత్రేయను శుక్రవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు దారుణంగా చంపేశారు. రాళ్లతో కొట్టి, పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో ఘటనా స్థలంలో ఆయన మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు పోలీసులు. వీరిలో గోల్డ్ మెన్ మేనల్లుడూ ఉండడం ఆశ్చర్యం కల్గిస్తోంది. 22 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన 3.5 కిలోల బరువున్న చొక్కా ధరించడంతో దత్తాత్రేయ అప్పట్లో వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే! వక్రతుండ చిట్ఫండ్ పేరుతో కంపెనీని ప్రారంభించిన దత్తాత్రేయ, ప్రజల నుంచి కోట్లాది రూపాయలను సేకరించాడు.

ఆయన అక్రమాలకు పాల్పడినట్టు గతంలో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. ఆర్థిక అక్రమాల నేపథ్యంలో ఆయన్ని హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూణేలోని భోసరి ప్రాంతంలో తమ ఇంటికి గురువారం అర్ధరాత్రి కొంతమంది వచ్చి తన భర్తను తీసుకెళ్లారని అతని భార్య సీమా చెబుతోంది. భారతమాత నగర్ కు తీసుకెళ్లి తన భర్తను హత్య చేశారని వెల్లడించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ తరపున గతంలో కార్పొరేటర్ గా ఆమె పని చేసింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Gold shirt man dattatreya murdered in Pune