చిత్తూరులో అరుదైన భారీ స్వర్ణ నాగు!

Golden color snake in Chittoor

04:14 PM ON 31st October, 2016 By Mirchi Vilas

Golden color snake in Chittoor

పాములు చాలా ఉంటాయి. అయితే నాగుపాములలో కొన్ని జాతి పాములుంటాయని అవి ధగ ధగ మెరుస్తాయని అంటారు కదా. సరిగ్గా అలాంటి పాము ఒకటి వెలుగుచూసింది. చిత్తూరు జిల్లా కేవీబీపురం న్యూకాలనీలో శనివారం ఉదయం ఓ ఆరుదైన భారీ స్వర్ణనాగు దారి తప్పి ఒక ఇంట్లోని నీటితొట్టెలో పడింది. ప్రాణాలను కాపాడుకోవడానికి తంటాలు పడుతున్న ఆ పామును చూసిన ఇంటి యజమాని మునెమ్మ అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. లేతస్వర్ణం రంగులో నీటిపై పడగతో తేలియాడుతున్న ఆ నాగపామును అధికారులు సురక్షితంగా బయటకు తీసి, అటవీప్రాంతంలో విడిచి పెట్టారు. కాగా, ఈ అరుదైన భారీ పామును చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

English summary

Golden color snake in Chittoor