గోల్డ్‌ ఫేషియల్‌ చేసుకోండిలా...

Golden facial at home

10:57 AM ON 17th December, 2015 By Mirchi Vilas

Golden facial at home

ఈ రోజు ఇంట్లో గోల్డ్‌ ఫేషియల్‌ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. చాలామంది స్థోమత లేక ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటారు. అంతేకాకుండా చాలా మంది సమయం దొరకక బయటకు వెళ్ళి ఫేషియల్స్‌ చేయించుకోలేక బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం ఈ రోజు ఈ అద్బుతమైన, సులభమైన గోల్డ్‌ ఫేషియల్‌ గురించి తెలియజేస్తున్నాం. మరి మీరు బంగారు వర్ణం సొంతం చేసుకోవాలంటే కొంత డబ్బు ఖర్చు చేయాల్సివస్తుంది. మీరు ఈ సౌందర్య సాధనాలు కొనుగోలు చేసేటప్పుడు మంచి బ్రాండెడ్‌ వస్తువులనే కొనుగోలు చేయాలి. వీటి ధర 450 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. మీకు నచ్చిన బ్రాండ్ ని మీరు ఎంపిక చేసుకొని వాటిని కొనుగోలు చేయండి. ఏవి పడితే అవి వాడ వద్దు. దానివల్ల మీ చర్మం పాడయిపోతుంది. అందువల్ల మీకు నచ్చిన మీరు నమ్మదగిన ప్రొడక్షన్స్‌ని వాడడం మంచిది. ఈ గోల్డెన్‌ ఫేషియల్‌ ని ఇంట్లో చేసుకోవడం వలన డబ్బు ఆదాతో పాటు బంగారు వర్ణం మీ సొంతం అవుతుంది. ఈ ఫేషయల్‌ కిట్‌ని ఒక్కసారి కొనడం వలన దీనిని 3 నుండి 4 సార్లు ఉపయోగించుకోవచ్చు. ఈ కిట్‌ ధర కేవలం 450 రూపాయలు. అదే సెలూన్‌ కి వెళితే ఒకసారి ఫేషియల్‌ చేయించు కోవడానికి 500 నుండి 700 రూపాయలు మీరు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల ఈ కిట్‌ని కొని వాడుకోవడం ఉత్తమం. కొన్ని సులభమైన పద్దతులను అనుసరించి ఎలా ఈ ఫేషియల్‌ చేసుకోవాలో తెలుసుకుందాం.

1/9 Pages

గోల్డెన్‌ ఫేషియల్‌ అన్ని రకాల చర్మతత్వం కలవారు వాడవచ్చు. అంటే ఆయిల్‌, డ్రై  మరియు సాధారణ చర్మం కలవారు అందరూ వేసుకోవచ్చు. కాని సున్నితమైన చర్మతత్వం కలవారు మాత్రం ముందుగా చేతిమీద ప్యాచ్‌ పరీక్ష చేసుకుని ఫేషియల్‌ చేసుకోవడం మంచిది.

గోల్డెన్‌ ఫేషియల్‌ కిట్‌లో ఉండేవి

1. గోల్డ్‌  క్లెన్సర్‌

2. గోల్డ్‌ స్క్రబ్‌

3. గోల్డ్‌ క్రీమ్‌

4. గోల్డ్‌ ఫేషియల్‌ జల్‌

5. గోల్డ్‌ ట్రీట్‌మెంట్‌ ప్యాక్‌

English summary

It is very easy and effective way. You can buy a branded golden facial kit in any cosmetic stores the price starts from Rs.450.