కొండవీడులో స్వ‌ర్ణ దేవాల‌యం!

Golden tample in Kondaveedu

12:30 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Golden tample in Kondaveedu

స్వర్ణ దేవాలయం.. పంజాబ్లోని అమృత్ సర్లోనే ఉంది. భారతదేశంలోనే ఇటువంటి ఆలయం మరొకటి లేదు. సిక్కులకు పవిత్ర స్థలం! మరి ఇటువంటి ఆలయాన్నిఆంధ్రప్రదేశ్లోనూ నిర్మించబోతున్నారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ పనులు చకచకా జరుగుతున్నాయి. జైపూర్ నుంచి తెచ్చిన ఎర్ర ఇసుక రాతితో రాజస్థాన్ నిపుణులు దీనిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఈ స్వర్ణ దేవాలయం ఎక్కడ నిర్మిస్తున్నారనే విశేషాలు తెలుసుకుందాం. ఏపీని అంతర్జాతీయ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా చారిత్రక కొండవీడు ప్రాంతంలోని చెంఘీజ్ఖాన్పేటలో స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు.

అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో రూ. 200 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. దక్షిణ భారతం, రాజస్థాన్ శైలిలో దీనిలోని మండపాలను నిర్మిస్తున్నారు. ప్రధాన స్వర్ణహంస దేవాలయ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆలయం కోసం చెంఘీజ్ఖాన్పేటలో ప్రభుత్వం కేటాయించిన 16.5 ఎకరాల్లో స్వర్ణహంస మందిర నిర్మాణం జరుగుతోంది. ప్రధాన ఆలయమైన స్వర్ణహంస మందిరానికి నలుదిక్కులా 108 మండపాల నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటికే 30 మండపాల నిర్మాణం చివరి దశకు చేరుకోగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.

కొండవీడు, చెంఘీజ్ఖాన్పేట గ్రామాల పరిధిలో దేవాదాయ శాఖకు చెందిన 81.08 ఎకరాలను 99 ఏళ్ల లీజుకు ప్రభుత్వం ఇస్కాన్కు కేటాయించింది. స్వర్ణ దేవాలయం పూర్తయిన వెంటనే దశలవారీగా ఆవుల పరిశోధనా కేంద్రం, భక్తి వేదాంత పాఠశాల, భక్తి వేదాంత ఆసుపత్రులను నిర్మించనున్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు అనువుగా భక్తి వేదాంత కళావేదికలను నిర్మించనున్నారు. ఒకేసారి 3 వేల మంది చూసేందుకు వీలుగా వేదిక నిర్మించబోతున్నారు.

English summary

Golden tample in Kondaveedu