తల్లి దండ్రుల పాప పుణ్యాలే పిల్లలకు రక్ష

Good and bad things of parents

07:06 PM ON 29th April, 2016 By Mirchi Vilas

Good and bad things of parents

తరచూ మనం వింటూ ఉంటాము ఏ జన్మ లో ఏం పాపం చేసామో ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నాం అని కొందరు అంటుంటారు..అలాగే ఈ లోకంలో బాధలు, కష్టాలు పడుతున్నవారు ఎందరో ఉన్నారు. కాని మనం చేసిన తప్పులు పక్కన పెట్టి దేవుడు మీద భారం వేస్తాము. గాలిలో దీపం పెట్టి దేవుడే దిక్కు అంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. ఏ జన్మలో ఏ పాపం చేసానో..ఈ జన్మలో అనుభవిస్తున్నాను..ఏ జన్మలో ఏం పాపం చేసానో ఇలాంటి భర్త దొరికాడు...పుణ్యం కొద్ది పురుషుడు పాపం కొద్ది బిడ్డలు అంటారు మన పెద్దవాళ్ళు. తెలిసి నేను ఏ పాపమూ చెయ్యలేదు అయినా నా కెందుకీ శిక్ష వేసాడు ఆ భగవంతుడు అని దేవున్ని నిందిస్తుంటారు కొందరు.

ఇది కుడా చదవండి : మరణానికి దగ్గరవుతున్న వారిలో లక్షణాలు

ఇలాంటి మాటలు రోజు ఎవరో ఒకరు అనడం మనం వింటూ ఉంటాము. మరి చెయ్యని తప్పులకు వాళ్ళు ఎందుకు శిక్షలు అనుభవిస్తున్నారు అంటే దానికి కారణం మాత్రం వాళ్ళు చేసిన పాపాలే అని చెప్పవచ్చు. మూడు తరములనుండి వెంబడిస్తూ వస్తున్న పాప పుణ్యాలే అని చెప్పుకోవచ్చు.

ఇది కుడా చదవండి :లక్ష్మీదేవి ఎందుకు అలుగుతుంది ?

ధన - ధాన్యాలు, వస్తు- వాహనాలు ఇవి మనకి కనిపించే ఆస్తులు అయితే, మన కళ్ళకు కనబడనివే పాప పుణ్యాలు.మన ఆస్తి తరతరాలుగా ఎలా అయితే వస్తుందో అలాగే మనం చేసిన తప్పులే మనకు పాప పుణ్యాలుగా సంక్రమిస్తాయి అని ధర్మ శాస్త్రం చెబుతుంది. ఆస్తి మాకు వద్దు, వారి పాపం మాకు వద్దు అంటే పోతాయా పోవు ఎందుకంటే చేసిన కర్మ అనుభవించాల్సిందే. మన శరీరమే తల్లిదండ్రులు, తాత ముత్తాతల ప్రసాదమైనప్పుడు ఈ శరీరానికి అంటిన పాపాలు అంత సులభంగా పోవు.

ఇది కుడా చదవండి : కొబ్బరి చెట్టు పుట్టుక రహస్యం !

మీ పాపాలు పోవాలంటే ప్రస్తుత జన్మలో నిత్య ధైవారాధన, మీకు కలిగినంతలోనే ఇతరులకు సహాయం చేయడం, ధాన ధర్మాలు చెయ్యాలి. నోరు తెరచి అడిగిన వారికి లేదు అనే సమాధానం చెప్పకూడదు. పుణ్య నదులలో స్నాసాలు, తీర్ధ యాత్రలు చేసి చేసిన పాపలకు పశ్చాత్తాపం చెందాలి. ప్రస్తుతతరం పాపాలు భవిష్యత్తు తరాలకు రాకుండా చూసుకోవాలి అంటే ఇవి చేయకతప్పదు.

English summary

Good and bad things of parents