అమరావతి రైతులకు శుభవార్త!

Good news for Amaravati farmers

12:16 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Good news for Amaravati farmers

ఏపీ రాజధాని అమరావతి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఓ గుడ్ న్యూస్. రాజధాని ఏర్పాటు కోసం భారీగా భూములను ఇచ్చిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరే తరుణం ఆసన్నమైంది. అదేమిటంటే, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బుధవారం రైతులకు ప్లాట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమరావతి పరిధిలో మొత్తం 29 గ్రామాల రైతులకు ప్లాట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాట్ల కేటాయింపులో ఇప్పటికే నేలపాడులోని రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లు ఇచ్చిన ప్రభుత్వం ఈ రోజు శాఖమూరు గ్రామానికి చెందిన రైతులకు ప్లాట్లు ఇవ్వనుంది.

ఈ నెలాఖరులోనే మరో ఐదు గ్రామాల రైతులకు కూడా ప్లాట్లు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక నవంబర్ 15వ తేదీకి రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ ముగించే దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది. వీరికి ప్లాట్లు కేటాయించడంతో పాటు రైతులు ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా రోడ్ల నిర్మాణం కూడా చేపట్టనుంది. ఈ 29 గ్రామాల్లో మౌలికవసతుల కల్పనకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఏదేమైనా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలో భాగంగా ప్లాట్ల కేటాయింపులు స్టార్ట్ అవ్వడంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు ఫుల్ ఖుషీ అవుతున్నారట.

ఇది కూడా చదవండి:తాగిన మత్తులో మనవాళ్ళు మాట్లాడే వింత మాటలు!

ఇది కూడా చదవండి:మళ్ళీ పెళ్ళికి సిద్ధమవుతున్న మనీషా కోయిరాల!

ఇది కూడా చదవండి:దారుణం: కన్నకూతురుకి కడుపు చేసిన తండ్రి.. ఆపై..

English summary

Good news for Amaravati farmers