ఏపీ నిరుద్యోగులకు శుభవార్త

Good news for AP unemployees

12:52 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Good news for AP unemployees

ఆంధ్రఫ్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ రంగం సిద్ధం చేస్తుంది. మొదట దేవాదాయ శాఖలోని 1100 పోస్టులకు నోటిఫికేషన్ వెలువరించి గ్రూప్ -2 నిర్వహించాలన్నది ఆంధ్రఫ్రదేశ్ సర్కారు అభిప్రాయం. ఇప్పటికే.. 20,250 ఖాళీల భర్తీకి చంద్రబాబు ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 12 వేల ఉద్యోగాలకు, పోలీసు శాఖలోని 8 వేల ఉద్యోగాలకు కేంద్రం నుంచి ఇండెంట్ అందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. వెబ్ సైట్ లో తొలిసారిగా నిరుద్యోగుల వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని దగ్గర చేసింది.

రిజిస్ట్రేషన్ చేసుకుంటే, అన్ని నోటిఫికేషన్లకూ సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే తొలి నోటిఫికేషన్ రాగానే, డైరెక్ట్ నోటిఫికేషన్లను సైతం ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు ప్రతిపాదించిన సిలబస్ పై ఉద్యోగార్థుల నుండి 1000కి పైగా అభ్యంతరాలు రాగా, వాటినిప్పుడు ఏపీపీఎస్సీ నిపుణులు పరీశిలిస్తున్నారు. నివేదిక రాగానే గ్రూప్ 1, 2, 4 లకు చెందిన సిలబస్ సైతం మారుస్తామని అధికారులు పేర్కొన్నారు.

English summary

Good news for AP unemployees. Good news for Andhra Pradesh unemployees.