రైల్వే లో సౌలభ్యం గల కొత్త నిబంధనలు

Good news for waiting list passengers

12:31 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Good news for waiting list passengers

ఇండియన్ రైల్వే ముందు ఉన్న పాత నిబంధనలకు కొన్ని నిబంధనలను జోడించి, ఇప్పుడు సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వెయిటీంగ్ లిస్ట్ ప్రయాణికులకు వేరే రైలులో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది .కొత్త నిభందనలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీ నుంచి హౌరా, ముంబై, చెన్నై, బెంగళూరు, సికింద్రాబాద్ రూట్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా వేరే రైల్లో గమ్యానికి చేర్చేందుకు వికల్ప్ పథకాన్ని విస్తరించింది. వారి ఇష్టం మేరకు వేరే రైల్లో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు బెర్త్ కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళచ్చు . ఈ పథకం మెయిల్ / ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లలో వర్తిస్తుంది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో మాత్రం ఈ పథకం వర్తించదు.

బుకింగ్ వేళల్లో మార్పులు కూడా మార్పులు కూడా చేసారు. ఏసీ బుకింగ్ లకు ఉదయం 10 నుంచి 11 వరకు. స్లీపర్ కోచ్ టికెట్ బుకింగ్ లకు ఉదయం 11 నుంచి 12 వరకు చేసారు. రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ల్లో కేవలం మొబైల్ టికెట్లనే అనుమతిస్తారు .

అన్ రిజర్వ్డ్ రైల్వే బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు , హ్యాండ్ హెల్డ్ టర్మినల్స్ ను ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్లాట్ ఫాం , అన్ రిజర్వ్డ్ , సీజన్ టికెట్లను కొనచ్చు.

ఇది కుడా చూడండి:మూడు ఏళ్లుగా ఒంటరి బతుకే

ఇది కుడా చూడండి:ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు.. ఆ తరువాత అసలు విషయం బయట

ఇది కుడా చూడండి:గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డ వీఆర్వో బృందం

English summary

Good news for waiting list passengers