మల్లూఉడ్ లో నయన్ హవా

Good Response For Nayanthara in Mollywood

06:50 PM ON 20th February, 2016 By Mirchi Vilas

Good Response For Nayanthara in Mollywood

టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది నయనతార. ఇప్పుడు మాత్రం కాస్త సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా మల్లూ ఉడ్ లో కూడా నయనతార దూసుకుపోతోంది. మలయాళంలో నయన నటించిన తాజా చిత్రం పుతియ నియమం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ సినిమాతో సౌత్ ఇండియాలో నయన రేంజ్ మరింత పెరిగిపోయింది. పుతియ నియమంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. ఆయనకు జోడీగా నయనతార నటించింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భాస్కర్ ది రాస్కెల్ అప్పట్లో మంచి సక్సెస్‌ను సాధించింది. తాజాగా వీరిద్దరూ కలసి నటించిన పుతియ నియమం సినిమాకు మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ గా ఉన్న నయనతార మలయాళంలోను వరుస విజయాలతో తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకుంటోంది.

English summary

Here are Mammootty and Nayanthara starrer Malayalam movie Puthiya Niyamam opened very well in Kerala Boxoffice eventhough much hype was there before the release.