అత్యంత విలువైన కంపెనీ.. ‘ఆల్ఫాబెట్‌’

Google Alphabet As Most Valuable Company

11:41 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Google Alphabet As Most Valuable Company

గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ఆల్ఫాబెట్ నాలుగో త్రైమాసికం ఫలితాలు విడుదలయ్యాయి. డిజిటల్‌, ప్రకటనల విభాగంలో ఆల్ఫాబెట్‌ మరింత వృద్ధిని నమోదు చేసింది. దీంతో ఎనిమిదేళ్ల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న యాపిల్‌ తొలిసారి ఆ స్థానాన్ని కోల్పోయింది. నాలుగో త్రైమాసికంలో ఆల్ఫాబెట్‌ 5 శాతం వృద్ధి సాధించి 4.9 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని గడించింది. సంస్థ ఒక్కొక్క షేర్‌ ధర 8.67 డాలర్లుగా నమోదైందని ఆల్ఫాబెట్‌ తెలిపింది. కంపెనీ ఇచ్చిన వివరాలను పరిశీలించిన విశ్లేషకులు ఒక్క షేర్‌ ధర సగటున 8.10 డాలర్‌గా అంచనా వేస్తూ యాపిల్‌ కన్నా వృద్ధి సాధించిందని తెలిపారు. ప్రస్తుతం ఆల్ఫాబెట్‌ మార్కెట్‌ విలువ 555 బిలియన్‌ డాలర్లు కాగా, యాపిల్‌ 553 బిలియన్‌ డాలర్లలో వెనుకబడిపోయింది. ఐఫోన్‌ అమ్మకాలు మందగించడం తదితర అంశాలు యాపిల్‌ కంపెనీ విలువ పడిపోవటానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోపక్క ఆల్ఫాబెట్‌.. సెర్చ్‌, ప్రకటనల వ్యాపారం(గూగుల్‌ సహా), అత్యధిక వేగం గల అంతర్జాల సేవలు, ఎక్స్‌ ల్యాబ్‌, స్వయం నియంత్రిత కార్లు, డ్రోన్‌లు తదితర విభాగాల్లో వృద్ధిని సాధించడం ద్వారా మదుపర్ల ఆదరణ చూరగొంది.

English summary

Google's Alphabet was elected as worlds most valuable company in the world.Apple lost its first position in last eight years.