ఆకర్షణీయ యాజమాన్యం 'గూగుల్'

Google As Most Attractive Employer In India

10:45 AM ON 22nd April, 2016 By Mirchi Vilas

Google As Most Attractive Employer In India

భారత్‌లో అత్యంత ఆకర్షణీయమైన యాజమాన్యాల్లో గూగుల్‌ మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ హ్యూమన్‌ రిసోర్సెస్‌ కన్సల్టెన్సీ రాన్డ్‌స్టాడ్‌ ఈ మేరకు ప్రకటించింది. ఆ సంస్థ 2016లో అత్యంత ఆకర్షణీయమైన యాజమాన్యం అవార్డును గూగుల్‌కు ప్రకటించింది. గూగుల్‌కు ఈ అవార్డు రావడం వరుసగా ఇది రెండోసారి. రాన్డ్‌స్టాడ్‌ అవార్డులను ఏటా ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ యాజమాన్యాలకు అందజేస్తారు. దీనిలో భాగంగా భారత్‌లో ఈ సారి దాదాపు 7500 మందిని సర్వే చేసి దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన యాజమాన్యాన్ని ఎంపిక చేసింది.

ఇవి కూడా చదవండి: సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం

ఇక విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ గూగుల్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. ఆయా విభాగాల్లో ప్రత్యేక గుర్తింపునకు ఇచ్చే అవార్డులను ఐటీ విభాగంలో డెల్‌ ఇండియా, వినియోగదారుల ఎలక్ట్రానిక్‌ విభాగంలో సామ్‌సంగ్‌ ఇండియా, ఈ-కామర్స్‌ విభాగంలో అమెజాన్‌ ఇండియాకు ప్రకటించారు. ‘ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో విపరీతమైన పోటీ ఉంది. ప్రతిభావంతులను నియమించుకొని.. వారిని కాపాడుకోవడం కంపెనీల ఎదుగుదలకు చాలా ముఖ్యం.. ప్రతిభావంతులను ఆకర్షించి.. వారికి ఉద్యోగాలు కల్పించే సంస్థలు ఎప్పుడూ మంచి ఫలితాలను సాధించడం చూస్తూనే ఉన్నాం’’ అని రాన్డ్‌స్టాడ్‌ ఇండియా ఎండీ మూర్తీ వివరించారు.

ఇవి కూడా చదవండి:

అఖిల్ ప్రేమించేది ఎవర్నంటే ...

రవుపై పోరుకు కదిలిన సచిన్‌, పెప్సీ

ఫోర్జరీ సంతకాల కేసులో టివి నటికి మూడేళ్ల జైలు శిక్ష

English summary

Google India company was Awarded as Most Attractive Employer In India for the Second Straight Time. Recently A Survey was done by Randstad India company.