ఈ నాటి గూగిల్‌ డూడిల్‌ వెనుక కథ ఇదే

Google Celebrates Verghese Kurien's Birthday

03:38 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Google Celebrates Verghese Kurien's Birthday

ఈరోజు గూగిల్‌ డూడిల్‌ను చూసారా. ఒక గేదె వద్ద నుంచుని ఉన్న ఒక వృద్దుని చిత్రాన్ని గూగిల్‌ డూడిల్‌గా పెట్టింది. ఈ డూడిల్‌ వెనుక కథ మీకు తెలుసా. ఆ డూడిల్‌లోని వ్యక్తి ఎవరో కాదు, దేశానికి శ్లేతవిప్లవాన్ని తీసుకువచ్చిన గొప్ప సామాజిక వేత్త, మిల్క్‌మేన్‌ ఆఫ్‌ ఇండియాగా కీర్తి గడించిన వెర్గీస్‌ కురియన్‌. కురియన్‌ 94వ జయంతి సందర్భంగా గూగిల్‌ తయారు చేసిన డూడిల్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

కురియన్‌ భారతదేశంలో శ్లేతవిప్లవానికి నాంధి పలికిన వ్యక్తి ప్రసిద్ధుడు. పాల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచలోనే అగ్రగామిగా ఉందంటే అదంతా కురియన్‌ చలవే. గ్రామీణభారతంలో పాల ఉత్పత్తిని పెంచేలా ప్రతీ ఒక్కరూ వ్యవసాయానికి సమాంతరంగా పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేసేలా కురియన్‌ ఎంతగానే దోహదపడ్డారు. కురియన్‌ అంటే ఎవరికీ తెలియక పోవచ్చు కానీ అమూల్‌ అనే బ్రాండ్‌ దేశంలోని ప్రతీ ఒక్కరికీ సుపరిచితమే. గ్రామీణ రైతులు మాత్రమే యజమానులుగా ఉండేలా తీర్చిదిద్దన అమూల్‌ కంపెనీ ఇప్పుడు పాల ఉత్పత్తి, వాటి సంబంధిత ఉత్పత్తులలో అగ్రగామిగా ఉంది. ఈ గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి కురియన్‌. అమూల్‌తో పాటు మరో 30 సంస్థలను స్థాపించిన గొప్ప దార్శనికుడు ఆయన. పాడిపంటలను నమ్ముకునే సగటు రైతు ఎప్పటికీ కురియన్‌ను గుర్తుంచుకుంటాడు. 2012 సెప్టెంబర్‌ 9న కురియన్‌ తన 90వ యేట కన్నుమూసారు.

English summary

Google Celebrates Verghese Kurien's 94th Birthday Today. Google posted Verghese Kurien by a doodle on its homepage showing the white revolution with milk can in his hand. Verghese Kurien is also called as Milkman of india