యోగా గురువుకి గూగుల్‌ నివాళి

Google celebratesd BKS Iyengar Yoga Teacher Birth Anniversary

06:29 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Google celebratesd BKS Iyengar Yoga Teacher Birth Anniversary

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది గాంచిన ప్రముఖ యోగా గురువు బీకేఎస్‌ అయ్యంగార్‌ కు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ, ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌ నివాళులర్పించింది. ఈరోజు బీకేఎస్‌ అయ్యంకార్‌ గారి జయంతి కావడంతో గూగుల్‌ డూడుల్‌ రూపంలో నివాళులు తెలిపింది.

బీకేఎస్‌ అయ్యంగార్‌ గారి పూర్తి పేరు బెల్లురు కృష్ణమాచార్‌ సుందరరాజ అయ్యంగార్‌ ఈయన కర్ణాటక రాష్ట్రం బెల్లురులో 1918 డిసెంబర్‌ 14న జన్మించారు. ఈయన ప్రవేశపెట్టిన యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ఈయన అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మవిభూషణ వంటి అవార్డులను పొందారు. ఈయన ఆగష్టు 20,2014 లో పూణేలో తుదిశ్వాస విడిచారు.

ఈ రోజు అయ్యంగార్‌ పుట్టిన రోజు సందర్భంగా గూగుల్‌ తన వెబ్‌పేజ్‌ లోని గూగుల్‌ పేరులోని అక్షరాల స్థానంలో అయ్యంగార్‌ గారు యోగా చేస్తున్నట్లు గా ఉన్న యానిమేటెడ్‌ బొమ్మలను పెట్టారు. సోమవారం గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ సైట్ WWW.GOOGLE.COM లోని గూగుల్ లోగోలోని కొన్ని అక్షరాల స్థానంలో అయ్యంగార్ యోగా చేస్తున్నట్టు ఉన్న బొమ్మలను పెట్టింది. ఈ విధంగా గూగుల్‌ యోగ గురువులను గూగుల్‌ డూడుల్‌ ద్వారా నివాళులు అర్పించింది.

English summary

Google’s doodle today honours BKS Iyengar, one of the famous Yoga teachers in the world, on his 97th birth anniversary.