సుందరపిచాయ్‌ భారత పర్యటనలో తీసుకున్న 9 నిర్ణయాలు 

Google CEO Sundar Pichai 9 things said in Google India Event

06:03 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Google CEO Sundar Pichai 9 things said in Google India Event

గూగుల్‌ సంస్ధకు సిఈఓగా ఎంపికైన తరువాత మొదటిసారిగా భారత్‌కు వచ్చిన సుందర పిచాయ్‌ తాము భారత్‌ లో తమ కంపెనీ భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడారు ఢిల్లీలో జరిగిన సమావేశం తో గూగుల్‌, యూట్యుబ్‌, మర్కెటింగ్‌ నిపుణులుపాల్గోన్నారు.

ఈ సమావేశంలో భాగంగా గూగుల్‌ సంస్ధ భారత్‌లో చేపట్టబోయే పలు కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఈ మేరకు గూగుల్‌ తీసుకున్న 9 నిర్ణయాలను ఆయన వివరించారు.

1. 2016 సంవత్సరం చివరిలోగా భారత్‌లోని 100 రైల్వే స్టేషన్‌ల లో ఉచిత వైఫై సేవలను పార్రంభించనున్నట్లు తెలిపారు. 2017 నాటికి 500 రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సెంటర్లను ఏర్పాటు చేస్తామని , ఇందులో భాగంగా మొదటిగా ముంబై రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

2. హైదరాబాద్‌, బెంగుళూరులో ఉన్న గూగుల్‌ సంస్ధల్లో ఉద్యోగ నియామకాలు చెప్పట్టనున్నట్లు తెలిపారు.

3. హైదరాబాద్‌ లో కొత్తగా మరో గూగుల్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చెయనున్నట్లు తెలిపారు.

4. గూగుల్‌ సంస్ధ ద్వారా భారత్‌ లో 20 లక్షల మంది డెవలపర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

5. ఇంటర్నెట్‌ ఆవశ్యకత గురించి మాట్లాడుతూ దేశంలో ఇంటెర్నెట్‌ ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా చేస్తామని, గూగుల్‌ ఇంటర్నెట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా భారత్‌ లోని 3 లక్షల గ్రామలోని ప్రజలకు ఇంటర్నెట్‌ సేవలను దగ్గర చేస్తామని తెలిపారు.

6. వచ్చే మూడేళ్ళలో భారత్‌లోని 3 లక్షల మంది మహిళలకు ఇంటర్నెట్‌ సేవలను దగ్గర చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.

7. గూగుల్‌ వారి లూన్‌ ప్రోజెక్ట్‌ను భారత్‌లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. లూన్‌ టెక్నాలజీ సహాయంతో 4జి టెక్నాలజీని బెలూన్‌ల సాయంతో 40 కిలో మీటర్ల మేర విస్తరించవచ్చు. ఈ టెక్నాలజీ ఇప్పటికే న్యూజిలాండ్, కాలిఫోర్నియా, బ్రెజిల్‌ వంటి దేశాలలో విజయవంతం అయ్యిందిని తెలిపారు.

8. గూగుల్‌ సంస్ధ వారి ఆండ్రాయుడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను వాడుతున్న వారి సంఖ్య భారత్‌ లో అమెరికా కన్నా ఎక్కువగా పెరుగుతుందిని. దీంతో భారత్‌ గూగుల్‌ సంస్ధకు హోం మార్కెట్‌గా నిలువనుందిని తెలిపారు.

9. చివరగా సుందర పిచాయ్‌ మాట్లాడుతూ 'దేశం నాకు చాలా ఇచ్చింది అందుకు ప్రతీకగా గూగుల్‌ సంస్ధ నుండి ఎంతో కొంత తిరిగి ఇవ్వగలనని అనుకుంటున్నట్లు తెలిపారు. భారత లోని ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్‌ను అందించి వారికి సమాచారం సరైన సమయంలో అందేలా చూస్తామని అన్నారు.

English summary

Google CEO Sundar pichai revieled that the things he want to do india. This was announced by Sundar Pichai In Delhi Google INdia Event