గూగుల్ సీఈఓ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి షాకిచ్చారు!

Google ceo Sundar Pichai twitter account was hacked

03:16 PM ON 28th June, 2016 By Mirchi Vilas

Google ceo Sundar Pichai twitter account was hacked

ప్రస్తుతం ఉన్న ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో హ్యాకర్లు హవా ఎక్కువ కొనసాగుతుంది. కొంతకాలం క్రితం ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి సంచలనం సృష్టించిన హ్యాకర్లు తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి మరోసారి హ్యాకింగ్ లో తమ సత్తా చాటి చూపించారు. అంతే కాదు అవర్ మైన్ అనే హ్యాకింగ్ గ్రూప్ తామే ఈ హ్యాకింగ్ చేశామని బహిరంగంగా ప్రకటించుకుంది. అవర్ మైన్ తన వెబ్ సైట్ లో సుందర్ పిచాయ్ ఖాతా హ్యాకింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేయడంతో హ్యాకింగ్ జరిగిందని నిర్ధారణ అయ్యింది.

సాక్షాత్తూ గూగుల్ సీఈఓ అకౌంట్ హ్యాకింగ్ కి గురవ్వడంతో ఇంటర్నెట్ ప్రపంచంలో సెక్యూరిటీ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో హ్యాకర్లు మరింతగా రెచ్చిపోతుండడం ఇంటర్నెట్ వినియోగదారులను ఎంతగానో కలవరించడంతో పాటు ఎంతగానో భయపెడుతుంది.

English summary

Google ceo Sundar Pichai twitter account was hacked