గూగుల్ డూడుల్ లో స్టెతస్కోప్‌ సృష్టి కర్తకు నివాళి

Google Doodle Pays Tribute To Rene Laennec

03:02 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Google Doodle Pays Tribute To Rene Laennec

ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ హోం పేజీలో తాజా అంశాలను పెడుతూ, ఆయా డేస్ ప్రాధ్యాన్యత కు అనుగుగుణంగా ప్రముఖులకు నివాళి అర్పిస్తున్న గూగుల్ సంస్థ తాజాగా బుధవారం పెట్టిన ప్రత్యేకమైన డూడుల్‌ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఇదేమంటే, స్టెతస్కోప్‌ను కనిపెట్టిన రెనె లెన్నెక్‌ 235వ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక డూడుల్‌తో నివాళులర్పించింది. లెన్నెక్‌ 1781లో ఫ్రాన్స్‌లో జన్మించారు. ఫ్రెంచ్‌ విప్లవం సమయంలో మెడికల్‌ కాడెట్‌గా పనిచేశారు. నెకర్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న సమయంలో 1816లో స్టెతస్కోప్‌ను కనిపెట్టాడు. ఆయన తన 46వ ఏట 1826లో మరణించాడు. వైద్య పరికరాల్లో అత్యంత ముఖ్యమైన వస్తువుగా స్టెతస్కోప్‌ మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి విషయాలను స్మరిస్తూ, గూగుల్ సరికొత్త సంప్రదాయం పాటిస్తోంది.

English summary

Google doodle today pays tribute to Rene Laennec ,the inventor of stethoscope, on his 235th birthday.Laennec was born in 1781 in France, studied medicine and served as a medical cadet in the French Revolution.