కాన్సస్ సిటీలో గూగుల్‌ ఫ్రీ ఇంటర్నెట్‌

Google Free Internet In Kansas City

10:36 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Google Free Internet In Kansas City

ప్రముఖ సెర్చ్‌ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ అమెరికాలోని పేదలకు ఉచిత ఇంటర్నెట్ అందజేయనుంది. గూగుల్‌ ఫైబర్‌ కంపెనీ ద్వారా ఈ ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పించనున్నట్టు ప్రకటించింది. ఇంటర్నెట్‌ సదుపాయం లేని.. తక్కువ రాబడితో జీవితాలను గడుపుతున్న వారికి ఈ అవకాశం కల్పిస్తోంది. బుధవారం కన్సాస్‌ సిటీ మార్కెట్‌లో ఈ ఉచిత సేవలను ప్రారంభించింది. త్వరలోనే ఇతర ప్రాంతాలకు కూడా వీటిని విస్తరించనుంది. కన్సాస్‌లో దాదాపు 1,300 కుటుంబాలవారికి 1000 ఎంబీపీఎస్‌ స్పీడ్ తో ఇంటర్నెట్‌ సేవల్ని ఉచితంగా అందజేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ ఫ్రీ ఇంటర్నెట్ తో ఒక హెచ్‌డీ మూవీని 7 సెకన్లలోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చట.

English summary

Search Engine Giant Google was providing free internet to poor people in Kansas City.Google announced that it was presently providing free internet to 1300 Families with 1000 Mbps Speed.Google also said that they Were going to expand this free internet service to more cities