'స్టార్ వార్స్' అభిమానులకు పండగ

Google gift for ‘Star wars’ fans

11:52 AM ON 8th January, 2016 By Mirchi Vilas

Google gift for ‘Star wars’ fans

గూగుల్ అందించిన మంచి కానుక

ఎప్పటికప్పుడు వైవిధ్యం ప్రదర్శించే గూగుల్ ఇప్పుడు మరో ప్రయోగం చేసింది. అదికూడా ఓ సినిమాకు సంబంధించి అభిమానులకోసం మంచి కానుక అందించింది. ‘స్టార్‌వార్స్‌’అభిమానులకు గూగుల్‌ సంస్థ ఈ క్రిస్మస్‌ పండుగ సందర్భంగా అందించిన ఈ కానుకకు సంబంధించి వివరాల్లోకి వెళితే, ప్రపంచమంతటా గడిచిన క్రిస్మస్‌కు ‘స్టార్‌వార్స్‌’ సిరీస్‌లో ఏడో సినిమా ‘ది ఫోర్స్‌ ఎవేకెన్స్‌’విడుదల అయింది. ఇక అభిమానుల ఆనందాన్నిరెట్టింపు చేస్తూ, గూగుల్‌ తమ సెర్చ్‌ఇంజిన్‌లో కొత్త టూల్‌ను ప్రవేశపెట్టారు. ‘స్టార్‌వార్స్‌’లో మీరు ఏ పక్షం వహిస్తారో దాన్ని బట్టి, ఆ కొత్త టూల్‌కూడా పనిచేస్తుంది. మీరు గనుక, కథలోని మంచి వైపు నిలబడితే, అంటే లూక్‌ స్కైవాకర్‌ పక్షంగానీ, లేదా జెడై పక్షంగానీ వహిస్తే, యూట్యూబ్‌లో ప్రోగ్రెస్‌ బార్‌ నీలం రంగు లైట్‌ శాబర్‌లాగా మారుతుంది.

అలా కాకుండా మీరు డార్త్‌ వేడర్‌ లేదా సిత్‌ పక్షం వహిస్తే, ప్రోగ్రెస్‌ బార్‌ రంగు ఎర్రగా ఉంటుంది. అంతేకాదు, యూట్యూబ్‌ స్క్రీన్‌కూడా రంగులు మారుతుంది. తెరమీదకు ‘ ఏ లాంగ్‌ టైమ్‌ ఎగో, ఇన్‌ ఏ గాలక్సీ ఫార్‌ ఫార్‌ ఎవే...’ అనే అక్షరాలు నీలం ఆకాశంలోకి దూసుకువెడుతున్నట్లు దర్శనం ఇస్తుంది. మీరు ఆ సినిమాలోని ఏ డైలాగ్‌ను రిఫరెన్స్‌ బార్‌లో కొడితే, దానికి తగ్గట్లు తెర మారుతుంటుంది. భలే వుంది కదూ, మరి ‘స్టార్‌వార్స్‌’ అభిమానులకు పండగ కాక మరేమిటి!

English summary

Google gift for ‘Star wars’ fans