కొత్త ఫీచర్లతో హ్యాంగవుట్స్..

Google Hangouts New Version New Features

10:28 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Google Hangouts New Version New Features

ప్రముఖ సెర్చ్ ఇంజింన్ దిగ్గజం గూగుల్ తన హ్యాంగవుట్స్ యాప్‌కు మరిన్ని నూతన హంగులను జోడించింది. ఈ యాప్‌కు చెందిన ప్రస్తుత వెర్షన్ 6.0 గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పటికే లభిస్తుండగా నూతన వెర్షన్ 7.0 మరికొద్ది రోజుల్లో యూజర్లకు లభ్యం కానుంది. కొత్త వెర్షన్ ద్వారా యూజర్లు ఇంతకు ముందు కన్నా మరింత వేగంగా, సులభంగా మెసేజ్‌లను పంపుకునే వీలు కల్పించనున్నారు. ఇందు కోసం యాప్‌ను ఓపెన్ చేయకుండానే ఆండ్రాయిడ్ డివైస్ హోం స్క్రీన్‌పై హ్యాంగవుట్స్ షార్ట్‌కట్‌ను ఏర్పాటు చేసుకునేలా యూజర్లకు అవకాశం కల్పించనున్నారు. ఈ షార్ట్‌కట్ నిర్దిష్ట కాంటాక్ట్‌కు చెందిన సంభాషణకు అనుసంధానమై ఉంటుంది. దీని వల్ల యూజర్ యాప్‌లోకి వెళ్లడకుండా నేరుగా డివైస్ హోం స్క్రీన్‌పై ఉన్న షార్ట్‌కట్ ద్వారానే సంభాషణను కొనసాగించవచ్చు. ఇతరులు పంపే మెసేజ్‌లకు వేగంగా రిప్లై ఇచ్చేందుకు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. దీంతోపాటు మరెన్నో ఫీచర్లను కొత్త అప్‌డేట్‌లో అందించనున్నట్టు తెలిసింది. అతి త్వరలోనే హ్యాంగవుట్స్ నూతన వెర్షన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుందని సమాచారం.

English summary

Google has released a new version of Google Hangouts App with the new features in its next version 7.0. Google Hangouts introduced a new feature that will allow users to create conversation shortcuts on home screen