గూగుల్ ప్రాంతీయ భాషల కీబోర్డు

Google Introduces Indic KeyBoard

08:44 PM ON 7th November, 2015 By Mirchi Vilas

Google Introduces Indic KeyBoard

మన నిత్య జీవితం లో స్మార్ట్ ఫోన్ ఒక భాగమైపోయింది. మన దేశంలో చాలా మంది ఫోన్ లో హిందీ కీబోర్డ్ ను తరుచుగా వాడుతుంటారు. అయితే ఇప్పటి వరకు మనం కేవలం హింది బాషతోనే సరిపెట్టుకున్నాం కాని ఇప్పుడు గూగుల్ సంస్థ వారు తన పాత హిందీ కీబోర్డ్ స్థానంలో ఒక కొత్త కీబోర్డ్ ను ప్రవేశ పెట్టింది . దాని పేరే " ఇండిక్ కీబోర్డ్ " . ఈ ఇండిక్ కీబోర్డ్ లో కేవలం హిందీ బాషనే కాక దేశంలోని ప్రాంతీయ భాషలైన తెలుగు,తమిళ్,అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ , ఒడియా , పంజాబీ , కన్నడ వంటి పలు భాషలను ఈ కీబోర్డ్ లో పొందుపరిచింది.

ఈ కీబోర్డ్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే.. ఒక భాషలో మనం టైపు చేసిన మెసేజ్ ను ఇంకో భాషలోకి అనువదించుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. హ్యాండ్ రైటింగ్ మోడ్ ను డైరెక్ట్ గా ఫోన్ స్క్రీన్ నుండి వాడుకునే సౌలభ్యాన్ని హిందీ భాష లో మాత్రమే పొందుపరిచారు.

ఇన్ని భాషలు కలిగిన ఈ కీబోర్డ్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

English summary

Google Introduces Indic KeyBoard