వాట్సాప్ కు పోటీగా సరికొత్త యాప్!

Google introducing Allo app

12:51 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Google introducing Allo app

ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్. ఇక దాంట్లో ఎన్నో ఫీచర్లు. ఇక సోషల్ మీడియా విభాగాల్లో హల్ చల్. ఇందులో ముఖ్యంగా వాట్సాప్ కు ఉన్న క్రేజ్ వేరు. అయితే, ఇప్పుడు గూగుల్ వాట్సాప్ కు పోటీగా అల్లో పేరిట కొత్త యాప్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ సంవత్సరం మేలో జరిగిన ఐ/ఓ డెవలపర్ల సదస్సులో డుయో, అల్లోలను గూగుల్ తొలిసారిగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది గూగుల్ సెర్చింజన్ ను కలుపుకుని మెసేజింగ్ యాప్ గా పనిచేస్తుంది. ఫోన్ నంబరునే ప్రాథమిక యూజర్ ఐడెంటిఫికేషన్ గా తీసుకుంటుంది. ఒకసారి యాప్ డౌన్ లోడ్ చేసుకుని గూగుల్ ఖాతాతో అనుసంధానించుకుని దీన్ని వాడవచ్చు.

ఎన్నో రకాల ఎమోజీలు, కస్టమ్ స్టిక్కర్స్ అందుబాటులో ఉంటాయి. ఏదైనా సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించే వేళ, చాట్ విండోను క్లోజ్ చేయకుండానే, గూగుల్ సెర్చ్ ని ఈ యాప్ ద్వారా వాడుకోగలగడం ఆకర్షణీయమైన ఫీచర్. అయితే వాట్సాప్ లో ఉండే కొన్ని ఫీచర్స్ మాత్రం అల్లోలో ఉండవని తేలిపోవడంతో రెండింటినీ వినియోగం చేయడానికి సిద్ధం అయిపోతున్నారు జనం.

ఇది కూడా చదవండి: టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

ఇది కూడా చదవండి:ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

ఇది కూడా చదవండి:ఈ ఈ రాసుల వాళ్ళు వివాహం చేసుకోకూడదట

English summary

Google introducing Allo app