త్వరలో గూగుల్ మెసెంజర్ యాప్

Google is working on a mobile messaging app to catch up with Facebook's Messenger and WhatsApp

05:59 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Google is working on a mobile messaging app to catch up with Facebook's Messenger and WhatsApp

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెసెంజర్ యాప్ లదే రాజ్యం. వాట్సాప్, వైబర్, హైక్ మొదలైన యాప్ లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ యాప్‌లకు రోజు రోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లను కూడా యూజర్లకు అందిస్తున్నాయి.

అయితే అన్ని మెసెంజర్ యాప్‌ల కన్నా ఫేస్‌బుక్‌ మెసెంజర్ యాప్‌కు యూజర్ల నుంచి అనూహ్య ఆదరణ లభిస్తోంది. దీంతో ఫేస్ బుక్ మెసెంజర్‌కు దీటుగా కొత్త మెసేజింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. తన హ్యాంగవుట్స్ అప్లికేషన్‌కు యూజర్ల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండడంతో గూగుల్ మరో కొత్త మెసెంజర్ యాప్‌ను రూపొందించే పనిలో పడింది. తన సెర్చ్ ఇంజిన్ సైట్‌లో ఉండే ఫీచర్లు, లింక్‌లతోపాటు అన్ని రకాల మెసెంజర్లలో ఉండే ఫీచర్లను ఈ నూతన యాప్‌లో గూగుల్ పొందు పరిచి యూజర్లకు అందించనున్నట్టు తెలిసింది. ఫేస్‌బుక్‌ను మించిన ఫీచర్లతో ఈ మెసెంజర్ యాప్‌ను తీర్చిదిద్దనున్నట్టు సమాచారం. ఇందుకోసమే గూగుల్ తీవ్ర కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

English summary

Google is working on a mobile messaging app to catch up with Facebook's Messenger and WhatsApp, viber and other mobile messengers.