గూగుల్-లెనోవో నుంచి ప్రాజెక్ట్ ట్యాంగో ఫోన్

Google-Lenovo's Tango Smart Phone

04:35 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Google-Lenovo's Tango Smart Phone

ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ లెనోవో ఒక సరికొత్త స్మార్ట్ ఫోన్ కు రూపకల్పన చేశాయి. ప్రాజెక్ట్ ట్యాంగో పేరిట రూపొందించిన ఈ ఫోన్ ను అమెరికాలో జరుగుతున్న సీఈఎస్-2016లో ప్రదర్శించాయి. మన చుట్టూ ఉన్న పరిసరాలను 3డీ స్కానింగ్ చేయగలగడం ఈ ఫోన్ ప్రత్యేకత. నిర్మాణాలు, రోడ్లు, కదిలే వస్తువులు, వ్యక్తులు ఎంత దూరంలో ఉన్నారు, పరిమాణం.. ఇలా పరిసరాలను పూర్తిగా అర్థం చేసుకునేలా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఫర్నీచర్ దుకాణానికి వెళ్లే ముందు ఇంటి లోపలి పరిసరాలను కెమెరాలో బంధిస్తే చాలు. దుకాణానికి వెళ్లిన తర్వాత అక్కడి ఫర్నీచర్ మీ ఇంట్లో ఎంతమేర స్థలాన్ని ఆక్రమిస్తుందో ఇట్టే చెప్పేస్తుంది. 3డీలో స్కాన్ చేసేందుకు వీలుగా మోషన్ ట్రాకింగ్ కెమెరాలు మూడింటిని వెనుకవైపు అమరుస్తున్నారు. సెకనుకు 2.5 లక్షలకుపైగా 3డీ కొలతలను ఇవ్వగలదు. మొబైల్ 3డీ సెన్సింగ్ రంగంలో పనిచేసేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ట్యాంగో ఫోన్ అందుబాటులోకి రానుంది. 6.5 ఇంచుల సైజ్ ఉండే ఈ ఫోన్ ధర సుమారు రూ. 35 వేల వరకు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ లో ఏఏ ఫీచర్లు ఉన్నాయనే విషయం ఫిబ్రవరి 15న లెనోవో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

English summary

Google and Lenovo in collaboration announced their first consumer-targeted product with Project Tango technology