యువతిని రేప్ చేసి హత్య చేసిన గూగుల్ మేనేజర్!

Google manager raped a girl in Newyork

05:15 PM ON 10th August, 2016 By Mirchi Vilas

Google manager raped a girl in Newyork

గూగుల్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న యువతిని అత్యాచారం చేసి అతి దారుణంగా చంపేసిన సంఘటన అమెరికాలో జరిగింది. గూగుల్ న్యూయార్క్ కార్యాలయంలో అకౌంట్స్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న వనెస్సా మార్కోటీ(27) అనే యువతిని రేప్ చేసి హత్య చేశారు. వనెస్సా మార్కోటీ మృతదేహాన్ని గుర్తు పట్టకుండా తగలబెట్టారని పోలీసు అధికారులు తెలిపారు. వనెస్సా మార్కోటీ తల్లి మసాచుసెట్స్ లోని ప్రిన్ ఫ్టన్ ప్రాంతంలో నివాసం ఉన్నారు. ఆదివారం ఆమె తల్లి దగ్గరకు వెళ్లారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో వనెస్సా కనపడకుండా పోయింది. కుమార్తె కోసం సాయంత్రం వరకు వేచి చూసిన ఆమె చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వనెస్సా తల్లి దగ్గరకు వచ్చిన తరువాత ఎప్పుడు ఎక్కడికి వెళ్లింది అని పోలీసులు ఆరా తీశారు. మధ్యాహ్నం వాకింగ్ కు అని చెప్పి వెళ్లిన వనెస్సా సమీపంలోని గ్రామీణ రోడ్డులో అదృశ్యం అయ్యిందని పోలీసులు తెలుసుకున్నారు. తరువాత పోలీసు జాగిలాలతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. పొదలలో సగానికి పైగా కాలిపోయిన మృతదేహాన్నిగుర్తించారు. శరీరం మీద ఎలాంటి దుస్తులు లేవని, కాళ్లు చేతులకు గాయాలైనాయని పోలీసులు అన్నారు. అత్యాచారం చేసి తరువాత ఆమెను హత్య చేశారని పోలీసులు చెప్పారు. వనెస్సా మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించిన వైద్యులు అత్యాచారం జరిగిందని నిర్దారించారు. అయితే ఎంత మంది రేప్ చేశారు అని తెలియడం లేదని, చుట్టు పక్కల ఉన్న గ్రామస్తులను విచారించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary

Google manager raped a girl in Newyork