గూగుల్ మ్యాప్ ఆఫ్ లైన్ ఫీచర్ 

Google Map’s New Offline Feature

07:01 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Google Map’s New Offline Feature

అనేక ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తున్న సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సంస్థ మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. గూగుల్ తన గూగుల్ మ్యాప్ సేవలను ఇంటర్నెట్ అవసరం లేకుండా ఉపయోగించే సౌలభ్యాన్ని అందించబోతోంది . దీని కోసం గూగుల్ సంస్థ ఒక కొత్త సాఫ్ట్ వేర్ ను అభివృద్ది చేసింది. ఈ కొత్త సాఫ్ట్ వేర్ తో ఆఫ్ లైన్ లోను నేవిగేషన్ సిస్టం చక్కగా పనిచేస్తుంది. దీని కోసం మనకు కావాల్సిన ఆఫ్ లైన్ ఏరియాను ముందుగానే డౌన్లోడ్ చేసుకోవాల్సివుంటుంది. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తరువాత ఇంటర్నెట్ సదుపాయం లేకున్నా నేవిగేషన్ ను పొందవచ్చు. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో అందుబాటులోకి తెచ్చారు. త్వరలో ఐఓఎస్ లో అందుబాటులోకి వస్తుందని గూగుల్ సంస్థ ప్రకటించింది.

English summary

Google Map’s New Offline Feature