హువాయ్‌ నెక్సెస్‌ 6పీ స్పెషల్‌ ఎడిషన్‌

Google Nexus 6p Special Edition

04:52 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Google Nexus  6p Special Edition

హువాయ్‌ నెక్సెస్‌ 6పీ స్పెషల్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యంతో సోమవారం నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. బంగారు రంగులో మాత్రమే ఈ ఫోన్‌ లభించనుంది. 64జీబీ అంతర్గత మెమొరీగల ఈ ఫోన్‌ ధర రూ.43,999 అని సంస్థ తెలిపింది.

ఈ ఫోన్‌ గతంలో రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు కొత్తగా ఈ స్పెషల్‌ ఎడిషన్‌ ద్వారా బంగారు రంగులో అందుబాటులోకి రానుందని హువాయ్‌ ఇండియా గ్రూప్‌ అధ్యక్షుడు అలెన్‌ వాంగ్‌ చెప్పారు. 5.7 క్యూహెచ్ డీ డిస్ ప్లే, 1440*2560 పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 64 బిట్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌, 12.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్షమాలో ఆపరేటింగ్ సిస్టమ్, 3,450 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పాత నెక్సెస్‌ 6పీ ఫీచర్లు ఉన్నాయి.

English summary

Huawei has launched Nexus 6P Special Gold colour Edition in India. The price of that smart phone at Rs. 43,999, this phone available to pre-order via Flipkart exclusively.