ఫొటో ఎడిటింగ్.. సో సింపుల్..

Google Photos That Makes Editing Of Photos More Easier

12:11 PM ON 7th March, 2016 By Mirchi Vilas

Google Photos That Makes Editing Of Photos More Easier

ప్రస్తుతం అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ ఉంటోంది. దీంతో ఎక్కడ కావలసి వస్తే అక్కడ.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫొటోలు తీసుకుంటున్నాం. అయితే వీటిని మనకు నచ్చినట్టుగా మార్చుకోవాలంటే మాత్రం కాస్త కష్టమే. ఆండ్రాయిడ్ యూజర్లు తమ డివైస్‌లలోని ఫొటోలను సులభంగా ఎడిట్ చేసుకునేందుకుగాను గూగుల్ ఫొటోస్ యాప్ కొత్త అప్‌డేట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ అప్‌డేట్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొందవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన డివైస్‌లలో ఇన్‌స్టాల్ అవుతుంది. గూగుల్ ఫొటోస్ యాప్ నూతన వెర్షన్ ద్వారా యూజర్లు తమ ఫొటోలను ఒక్క టచ్‌తోనే ఎడిట్ చేసుకునేందుకు వీలుంది. దీంతోపాటు పలు రకాల ఫిల్టర్లు, కలర్ అడ్జస్ట్‌మెంట్ ఫీచర్లు, కొల్లేజ్‌లు, ఎడిటింగ్ టూల్స్ వంటి వాటిని ఈ యాప్‌లో మరింత మెరుగ్గా పనిచేసేలా తీర్చిదిద్దారు. యూజర్లు తాము ఎడిట్ చేసుకున్న ఫొటోలను వెంటనే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా ఇతరులకు షేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకేసారి దాదాపు 1,500 ఫొటోలను ఇతరులతో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

English summary

Google photos makes photo editing easier and more fun. The latest update to the editor brings plenty of new, exciting, user-friendly features that will make your social media profiles etc