గూగుల్ కొత్త కార్డ్‌బోర్డ్ కెమెరా యాప్.. 

Google Released New Card Board App

01:13 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Google Released New Card Board App

కొత్త కొత్త యాంగిల్స్‌లో సరికొత్తగా ఫొటోలను తీసుకోవడానికి గూగుల్ సంస్థ కార్డ్‌బోర్డ్ కెమెరా యాప్‌ను విడుదల చేసింది. ఈ కార్డ్ బోర్డ్ కెమెరా యాప్ తో మనం ఒక యాంగిల్‌లోనే ఫోటోలను తీసుకోవడం కాకుండా మనం ఫోటో దిగాలనుకున్నచోట ఉన్న ప్రదేశం అంతా కవర్ అయ్యేలా మనం ఫొటోలు తీసుకోవచ్చు. మొత్తం 360 డిగ్రీస్‌ యాంగిల్స్ లో మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఒకే ఫోటోలో తీయవచ్చు. ఈ యాప్ ద్వారా ఫొటోను వీఆర్ ఫొటోలాగా తీయవచ్చు .

మన ఫోన్ పట్టుకుని చుట్టూ గుండ్రంగా తిరిగి మన చుట్టూ ఉన్న పరిసరాలు ఒకే ఫొటోలో వచ్చేలాగా కార్డ్‌బోర్డ్ కెమెరా యాప్ ఫోటోలు తీస్తుంది . అలాంటి ఫొటోలను యాప్ వీఆర్ ఫొటోలాగా చూపిస్తుంది. ఇది దగ్గర వస్తువులను దగ్గరగా.. దూరంగా ఉన్న వాటిని దూరంగానే చూపిస్తుంది. మన ఫొటోతో పాటు శబ్దాలు కూడా ఈ యాప్ తో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్‌బోర్డ్ కెమెరా యాప్ మనం తీసిన ఫొటోను 3డీ ఫొటో లాగా మార్చి చూపిస్తుంది. ఇన్ని ఫీచర్లు కలిగిన ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

English summary

Google Release its new app named card board app, with the use of that app we can take photos like VR photos