డేంజర్ యాప్స్ ను తొలగించిన ప్లేస్టోర్‌

Google Removes Dangerous Apps From Play Store

06:31 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Google Removes Dangerous Apps From Play Store

13 డేంజరస్ యాప్ లను ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. కేక్‌ బ్లాస్ట్‌, జంప్‌ ప్లానెట్‌, హనీ కోంబ్‌, క్రేజీ బ్లాక్‌, క్రేజీ జెల్లీ, టైనీ పజిల్‌, నింజా హూక్‌, పిగ్గీ జంప్‌, జస్ట్‌ ఫైర్‌, ఈట్‌ బబుల్‌, హిట్‌ ప్లానెట్‌, కేక్‌ టవర్‌, డ్రేగ్‌ బాక్స్‌ యాప్‌లను తీసేసింది. మొబైల్‌ భద్రత సంస్థ అయిన లుక్‌అవుట్‌కు చెందిన సైబర్‌ భద్రత పరిశోధకుడు క్రిస్‌ దెగాన్‌పూర్‌ ఈ యాప్‌లు హానికరంగా ఉన్నట్లు గుర్తించారు. దాదాపుగా పది లక్షల డౌన్‌లోడ్‌లు అయిన ఈ యాప్‌లు తప్పుదారిలో నడుస్తున్నాయని ఆయన చెప్పారు. వాటికవే సానుకూల సమీక్షల్ని ఇచ్చుకుంటున్నాయన్నారు. భవిష్యత్తులో వాటి డౌన్‌లోడ్‌లు బాగా పెంచుకోవడం కోసమే ఈ యాప్‌లు ఆ పని చేస్తున్నాయని చెప్పారు. వినియోగదారుడి అనుమతి లేకుండా వారి పేరుపై ఈ సమీక్షలు పోస్ట్‌ అవుతున్నాయన్నారు. ఈ కారణాల వల్ల గూగుల్‌ వీటిని యాప్‌స్టోర్‌ నుంచి తొలగించింది.

English summary

Google has removed 13 Android apps from the Google Play after it was notified by security researchers that these apps made unauthorised downloads to the Android devices.