గూగుల్ కి 25 వేల కోట్ల ఫైన్?

Google reportedly faces 25 Thousand Crores Fine

11:05 AM ON 17th May, 2016 By Mirchi Vilas

Google reportedly faces 25 Thousand Crores Fine

నెటిజన్లు గూగుల్ లో ఏదైనా వెతికేటప్పుడు తమకు అనుకూలమైన కంపెనీల గురించిన వివరాలు ముందు కనిపించేలా వరల్డ్ టాప్ సెర్చింజన్ గూగుల్ సాఫ్ట్ వేర్ ను మార్చిందని.. ప్రత్యర్థి కంపెనీలను దెబ్బతీయడమే గూగుల్ ఉద్దేశమని పేర్కొంటూ గూగుల్ కు వ్యతిరేకంగా ఒక కేసు దాఖలైంది. దీంతో గూగుల్ కు భారీ జరిమానా విధిస్తారని వినికిడి. ఆ కేసులో యూరోపియన్ యూనియన్ కాంపిటేటివ్ కమిషన్ ముందు విచారణ ముగిసింది. తీర్పు గూగుల్ కు వ్యతిరేకంగా రాబోతోందని ప్రపంచంలోని పలు మీడియాల్లో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి: తదుపరి సిఎమ్ నారా లోకేష్?

ఈ కేసులో గూగుల్ కు వ్యతిరేకంగా తీర్పు రానుండడమే కాకుండా 3 బిలియన్ యూరోలు అంటే దాదాపు 25 వేల కోట్లు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. జూన్ మొదటి వారంలో జరిమానా పై తుది నిర్ణయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. జరిమానా విధించడమే కాకుండా సెర్చి రిజల్ట్సు విషయంలో గూగుల్ కు ఉన్న అదికారాలకు కూడా కత్తెర వేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి కోర్టు నియమాలు ఫ్రేమ్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. విచారణలో భాగంగా సెర్చింజన్ పరిశీలించిన సమయంలో మొదటి స్థానంలో నిలిచిన కంపెనీలపై 10 శాతం జరిమానాగా సుమారు రూ. 2300 కోట్లు విధించవచ్చని తెలుస్తోంది. మరోవైపు సెర్చు రిజల్ట్సే కాకుండా ట్రావెల్ ఇన్ఫర్మేషన్ మ్యాపుల విషయంలోనూ గూగుల్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలోనూ గూగుల్ కు ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు. మొత్తానికి గూగుల్ మీద అభాండాలు నిజం కాబోతున్నాయా? అంత భారీగా ఫైన్ విధించబోతున్నారా అన్నది తేలాల్సి వుంది.

ఇవి కూడా చదవండి: బాయ్ ఫ్రెండ్స్ తో చాటింగ్ వద్దన్నందుకు భర్త వేళ్లను కోసేసింది

ఇవి కూడా చదవండి: 'బ్రహ్మోత్సవం' స్పెషల్ షోకి పర్మిషన్

English summary

World's Popular Search Engine Giant Google was going to be fined with a huge amount of 25 Thousand Crores because of a Petition filed in Europe. According to that Petition some of the companies were saying that Google made a software that shows the friendly companies in Google Search Engine.