పికాసా వెబ్ ఆల్బమ్స్‌కు గూగుల్ గుడ్ బై!

Google Says Good By To Picasa

10:58 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Google Says Good By To Picasa

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన ఫొటో షేరింగ్ సర్వీస్ పికాసా వెబ్ ఆల్బమ్స్‌కు గుడ్ బై చెప్పనుంది. త్వరలోనే ఈ సేవలను గూగుల్ నిలిపివేయనుంది. మార్చి 1 నుంచి ఈ సేవలు యూజర్లకు అందుబాటులో ఉండవు. ఇప్పటికే అందుబాటులో ఉన్న గూగుల్ ఫొటోస్‌కు మరిన్ని హంగులను అద్ది యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే పికాసా వెబ్ ఆల్బమ్స్‌కు ముగింపు పలకనుంది. పికాసా వెబ్ ఆల్బమ్స్, గూగుల్ ఫొటోస్ రెండూ దాదాపు ఒకే విధమైన సేవలను వినియోగదారులకు అందిస్తుండగా, వీటిని వినియోగించడంలో తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించేందుకే పికాసా వెబ్ ఆల్బమ్స్‌ను నిలిపివేస్తున్నట్టు గూగుల్ తెలిపింది. గూగుల్ ఫొటోస్‌ను ఇతర ఫొటో షేరింగ్ సైట్ల కన్నా మెరుగ్గా తీర్చిదిద్ది యూజర్లకు అందిస్తామని ధీమాగా చెబుతోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ మాధ్యమాల్లో ప్రస్తుతం గూగుల్ ఫొటోస్ లభిస్తోంది.

English summary

World's Popular Search Engine Giant Google To Say good bye to Picasa Web Albums.Google to stop Picasa services from March 1st.This was said by Google.