ఫ్రీబేసిక్స్‌ ఇంటర్నెట్‌కు గూగుల్ గుడ్ బై

Google Says Good Bye To Free Internet Basics

11:39 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Google Says Good Bye To Free Internet Basics

ఫ్రీబేసిక్స్.... ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో వేడిని పుట్టిస్తున్న అంశం. ఫేస్ బుక్ సృష్టించిన ఈ ప్లాట్‌ఫామ్‌ను వ్యతిరేకించే వాళ్లు రోజురోజుకి పెరిగిపోతున్నారు. కాగా సెర్చింజన్ గూగుల్ కూడా ఆ కోవలోకే వచ్చేట్టు కనిపిస్తోంది. జాంబియాలో ఫ్రీబేసిక్స్ ను ప్రయోగాత్మకంగా (ట్రయల్ వెర్షన్) అమలు చేశారు. దానిలో గూగుల్ కి కూడా భాగస్వామ్యం ఉంది. అయితే జాంబియాలో ఆ భాగస్వామ్యానికి సెర్జింజన్ దిగ్గజం వీడ్కోలు చెప్పింది. ఈ మేరకు గూగుల్ అధికార ప్రతినిధి మీడియాకు మెయిల్ చేశారు. ఆ మెయిల్‌లో ఉన్న సమాచారం ప్రకారం... గూగుల్, ఫ్రీబేసిక్స్‌లో కానీ ఇంటర్నెట్.ఓఆర్‌జీ లో కానీ భాగస్వామి కాదని స్పష్టం చేశారు. జాంబియాలో ప్రాథమిక దశలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజక్టులోనే భాగస్వామిగా ఉన్నామని తెలిపారు. అయితే ఫ్రీబేసిక్స్ పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుండడంతో గూగుల్ తన భాగస్వామ్యాన్ని వెనక్కి తీసుకుంది. ఇది ఫేస్‌బుక్‌కు ఫ్రీబేసిక్స్ విషయంలో గట్టిదెబ్బ తగిలినట్టే. ఇప్పటికే ఇండియాలో ట్రాయ్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. డాటా సర్వీసులకు విభిన్నమైన ధరలు... వినియోగదారులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయని వాదిస్తోంది. కాగా గూగుల్ త్వరలో ముంబై రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై ను అందుబాటులోకి తెస్తోంది. దీనిపై గత నెలలో గూగుల్ ప్రతినిధి మాట్లాడుతూ వైఫై పూర్తి ఉచితమని, నెట్ నూట్రాలిటీ ఉంటుందని వివరించారు. కేవలం గూగుల్ అప్లికేషన్లను కాకుండా ఏ వెబ్ సైట్లు, అప్లికేషన్లు అయినా వైఫై ద్వారా అందుబాటులోకి వస్తాయని, పూర్తిగా నెట్ న్యూట్రాలిటీ ఉంటుందని చెప్పారు.

English summary

Free internet basic was opposing by some of the companies today another company was also joined by opposing free internet basics. Google spokesperson confirmed the development, saying that it was only an initial trial that they were a part of. "Google is not a partner in Free Basics or Internet.org. However, we were included in the initial trial of this project, which was first launched in Zambia