గూగుల్‌కూ సర్వీస్ ప్రొబ్లెమ్స్..

Google Services Problems

11:29 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Google Services Problems

ట్విట్టర్, వాట్సప్ తాజాగా గూగుల్ ఇదే జాబితాలో చేరింది. ఏమిటీ జాబితా అనుకుంటున్నారా.. సేవలకు స్వల్ప అంతరాయం కలిగే జాబితా. ఇటీవల ట్విట్టర్, వాట్సప్ సేవలకు స్వల్ప అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. తాజాగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. గూగుల్‌కు చెందిన గూగుల్ డ్రైవ్, జీమెయిల్, డాక్స్ వంటి సేవలకు ప్రధానంగా అంతరాయం కలుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు యూజర్లు ఇప్పటికే ఆయా వెబ్‌సైట్ల ద్వారా ఈ విష‌యాన్ని తెలియజేస్తుండగా గూగుల్ మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. కొంత మంది యూజర్లకు చెందిన జీడ్రైవ్ అకౌంట్లలో వారు స్టోర్ చేసుకున్న ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, ఇతర ఫైల్స్ పూర్తిగా మాయమయ్యాయని తెలిసింది. మరికొందరు యూజర్లు గూగుల్ సెర్చ్ బాగా స్లోగా ఉన్నట్టు వెల్లడిస్తున్నారు. కాగా కొన్ని చోట్ల ఇప్పటికే సేవలను పునరుద్దరించినట్టు వార్తలు వస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో యూజర్లు ఇంకా సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారని వినిపిస్తోంది.

English summary

Google was also face service down problem yesterday. Some of the users around the world faces some problems that their files in Google Drive was lost. Upto to now google company did not responded on this issue