ఐఫోన్ ని తలదన్నేలా గూగుల్ ఫోన్

Google to launch new mobile phone

11:08 AM ON 28th June, 2016 By Mirchi Vilas

Google to launch new mobile phone

స్మార్ట్ ఫోన్ రంగంలో ఎన్నో మార్పులు ... అసలు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లలో యాపిల్ ఐఫోన్ నూతన విప్లవాన్ని తీసుకొచ్చింది. ఎన్ని కొత్త ఫోన్లు వచ్చినా.. ఐఫోన్ ముందు దిగదుడుపే అన్నట్లు ఉంది. ఇప్పుడు ఐఫోన్ కు దీటుగా కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. దీనికోసమే ప్రపంచ దిగ్గజ సంస్థ, ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కసరత్తు చేస్తోందట.

సొంత స్మార్ట్ ఫోన్ ను తయారుచేసే యోచనలో గూగుల్ ఉందని.. ఇది ఐఫోన్ కు గట్టి పోటీ ఇవ్వగలదని టెక్ నిపుణులు చెబుతున్నారు. గూగుల్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కోసం మొబైల్ ఆపరేటర్లతో ఆ సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ కొత్త డివైజ్ ఈ ఏడాది చివరకు విడుదలయ్యే అవకాశం ఉందని ‘ది టెలిగ్రాఫ్ ’ పేర్కొంది. యాపిల్ ఐఫోన్ తో ముఖాముఖి తలపడేందుకు గూగుల్ సిద్ధమైనట్లు మరో సంస్థ 9టు5మ్యాక్ వెల్లడించింది. ఐఓఎస్ పై యాపిల్ మాదిరిగా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ పై మరింత నియంత్రణ సాధించాలని గూగుల్ కోరుకుంటోందట. మరి వీలైనంత త్వరగా గూగుల్ ఫోన్ రావాలని స్మార్ట్ ఫోన్ ప్రియులు కోరుకుంటున్నారు.

ఇది కూడా చూడండి: జూన్ నెలలో పుట్టిన వారి విశిష్ట లక్షణాలు

ఇది కూడా చూడండి: బీరుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా!

ఇది కూడా చూడండి: ఐపీఎల్ లో మన క్రికెటర్లు ఒక్క రన్ కి ఎంత సంపాదించారో తెలుసా?

English summary

Google to launch new mobile phone.